నేచురల్ స్టార్ నాని కొంతకాలం వరకు మినిమం సక్సస్ గ్యారెంటీ హీరో. వరసగా నాని నటించిన 6సినిమాలు హిట్ అవ్వడంతో డబల్ హ్యాట్రిక్ హీరోగా నాని ఒక రికార్డు క్రియేట్ చేసాడు. దీనితో నాని పారితోషికం పెరిగిపోవడమే కాకుండా అతడు మీడియం రేంజ్ హీరోలలో టాప్ స్థానానికి చేరిపోయాడు. అయితే గత రెండు సంవత్సరాలుగా నాని కెరియర్ ఏమాత్రం బాగుండటం లేదు.


అతడి సినిమాలు అన్నీ వరసగా ఫ్లాప్ అవుతూ ఉండటంతో నాని మార్కెట్ కూడ కొంతమేరకు దెబ్బతిన్నది అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో నాని ఆశలు అన్నీ అతడి లేటెస్ట్ మూవీ ‘దసరా’ మూవీ పైనే ఉన్నాయి. నాని తన కెరియర్ లో పూర్తి మాస్ లుక్ లో నటిస్తున్న ఈమూవీ ‘పుష్ప’ స్థాయిలో హిట్ అవుతుందని ఆశ పడుతున్నాడు.


మార్చి 30న విడుదల కాబోతున్న ఈమూవీ షూటింగ్ కు నాని బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం అయ్యప్ప మాల వేసుకుని చాల నిష్టగా పూజలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవైపు పూజలు చేస్తూనే మరొక వైపు ఖాళీగా ఉండకుండా నాని తన సోదరి దర్శకురాలుగా మారి తీసిన వెబ్ సిరీస్ ను ప్రమోట్ చేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. ఈ నెల 25 నుండి ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్ లో స్ట్రీమ్ కాబోతోంది. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూలు ప్రీ రిలీజ్ ఈవెంట్లు అన్నీ నాని దగ్గర ఉండి చూసుకుంటున్నాడు.


ఒకవైపు ఈపనులు చూస్తూనే నాని అడవి శేషు తో తీసిన ‘హిట్ 2’ మూవీ ప్రమోషన్ ను కూడ భారీ స్థాయిలో చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 2న విడుదల కాబోతున్న ఈమూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇలా నాని ఒకవైపు సినిమాలలో నటిస్తూ మరొకవైపు తన సోదరిని ప్రోత్సహిస్తూ మధ్యలో తాను నిర్మాతగా మారి వరస పనులతో బిజీగా ఉంటూ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు అనుకోవాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: