అసలు అపజయం ఎరుగకుండా చాలా కూల్  గా ఎటువంటి హడావిడి ఓవర్  యాక్షన్  లేకుండా వరుసగా విజయవంతమైన సినిమాల్లో నటిస్తూ.. అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటూ ..తనదైన క్రేజ్‌  ఇంకా అలాగే  ఇమేజ్‌ను సంపాదించుకున్న ఏకైక హీరో అడివి శేష్‌. ఇక శేష్   హీరోగా డైరెక్టర్  శైలేష్  కొలను దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా 'హిట్ 2'. హిట్ ది ఫస్ట్ కేస్ సినిమాతో ఎంతగానో మెప్పించిన శైలేష్ హిట్ 2 ది సెకండ్ కేస్‌తో మరోసారి పర్‌ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. కిలాడి సినిమాతో మెప్పించిన మీనాక్షి చౌదరి ఇందులో అడివి శేష్ జోడీగా నటించింది. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అయిన న్యాచురల్ స్టార్ నాని సమ్పరణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేని ఈ సినిమాను నిర్మించడం జరిగింది. ఇక ఈమధ్య విడుదలైన టీజర్ అయితే ఈ సినిమా పై మరింత క్యూరియాసిటిని పెంచేసింది. 


తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్.తాజాగా విడుదలైన ట్రైలర్ అయితే చాలా సూపర్ గా ఉంది. ఇది ఆద్యంతం ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. ఈ ట్రైలర్ చూస్తుంటే మరింత భయంకరమైన కేసును ఎదుర్కొన్న కూల్ పోలీసు కృష్ణ దేవ్ ప్రయాణంలో ఒక స్నీక్ పీక్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఈ ట్రైలర్‌లో మొత్తం నగరాన్ని కదిలించిన భయంకరమైన హత్య కేసును అడివి శేష్ ఎలా సాల్వ్ చేశాడు అనేది ఈ హిట్ 2 మూవీ హింట్ ఇస్తుంది. ఇక ఇందులో హోమీసైడ్ ఇంటర్‌వెన్షన్ టీమ్‌లో కూల్ పోలీస్ అయిన కె.డి అనే పోలీస్ ఆఫీసర్‌గా అడివి శేష్ కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ఇంకా రావు రమేష్‌, శ్రీనాథ్‌ మాగంటి, కోమలి ప్రసాద్ వంటి నటులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటి కే ఇక అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: