గత కొద్ది రోజుల నుంచి టాలీవుడ్ , కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సినిమాల విడుదలపై గందరగోళం మొదలైన విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగకు తెలుగులో రెండు పెద్ద సినిమాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో కలెక్షన్లను దృష్టిలో పెట్టుకొని కోలీవుడ్ సినిమాలను సంక్రాంతి పండుగగా టాలీవుడ్లో విడుదల చేయకూడదని.. టాలీవుడ్ నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు.. అయితే ఈ విషయాన్ని తిప్పికొడుతూ కోలీవుడ్ సినీ దర్శకనిర్మాతలు కూడా తమ సినిమాలను తెలుగులో రిలీజ్ చేయడానికి ఒప్పుకోకపోతే.. తెలుగు సినిమాలను కూడా తమిళ్లో రిలీజ్ కి అడ్డుకుంటామని కూడా నిర్మాతల మండలి హెచ్చరిస్తోంది.

అంతేకాదు తమిళనాడు సినీ నిర్మాతల మండలి నుంచి ఒక్కొక్కరుగా టాలీవుడ్ లో సినిమాలను విడుదల చేయడానికి అనుమతి ఇవ్వాలని..  లేని పక్షంలో తమిళనాడులో ఒక్క టాలీవుడ్ సినిమా కూడా ప్రదర్శించబడదు అంటూ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  ఈ క్రమంలోనే టాలీవుడ్ దర్శకనిర్మాతలంతా ఇప్పుడు ఏకతాటిపై నిలబడే సమయం వచ్చింది అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. గత కొన్ని రోజుల నుంచీ కోలీవుడ్ బెదిరింపులకు ఇప్పటివరకు టాలీవుడ్ లో ఒక్క వ్యక్తి కూడా స్పందించలేదు.  మొదట లింగుసామి, ఆ తర్వాత దర్శకుడు సీమాన్, ఇప్పుడు దర్శకుడు పేరరసు కూడా టాలీవుడ్‌ని బెదిరించాడు.

అయితే కోలీవుడ్ నుంచి దర్శకులు నిర్మాతలు ఎంతమంది బెదిరించినా సరే టాలీవుడ్ నిర్మాతలు దర్శకులు వెనక్కి తగ్గకుండా తమ నిర్ణయాలను ఏకతాటిపై వెల్లనిస్తే ఖచ్చితంగా టాలీవుడ్ సక్సెస్ అయినట్లే. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర భాష లలో కూడా తెలుగు సినిమాలకు మంచి ఆదరణ ఉంది. ఇలాంటి సమయంలో టాలీవుడ్ దర్శక నిర్మాతలలో ఒకవేళ భేదాభిప్రాయాలు వస్తే కోలీవుడ్ దర్శక నిర్మాతలదే పై చేయి అవుతుంది. అందుకే టాలీవుడ్ వాళ్లంతా ఏకతాటిపై నిలిచి తమ సినిమాలను ఎప్పుడు.. ఎక్కడ..  ఎలా రిలీజ్ చేయాలో ఒక ప్లాన్ చేసుకుంటే ఈ ఇబ్బందులు ఉండవని పలువురు తమ అభిప్రాయాలుగా వ్యక్తం చేస్తున్నారు మరి ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: