తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీకాంత్ తన కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలలో నటించి తన నటనతో ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత సినిమాలలో హీరోగా అవకాశాలను దక్కించుకొని అనేక సినిమాలలో హీరోగా నటించి , ఎన్నో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని , ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగించాడు.

ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో శ్రీకాంత్ సోలో హీరోగా విజయాలను అందుకోవడంలో చాలా వరకు స్లో అయ్యాడు. దానితో శ్రీకాంత్ ప్రస్తుతం సినిమాలలో ఇతర ముఖ్య పాత్రలలో మరియు విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అందులో భాగంగా పోయిన సంవత్సరం బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ మూవీ లో శ్రీకాంత్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం , ఈ మూవీ లోని శ్రీకాంత్ పాత్రకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఈ మూవీ ద్వారా శ్రీకాంత్ కు అద్భుతమైన క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే గత కొన్ని రోజులుగా శ్రీకాంత్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

నటుడు శ్రీకాంత్ తన భార్య ఊహతో విడిపోతున్నట్లు ఒక వార్త కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్తపై స్పందించిన శ్రీకాంత్ కొన్ని చిల్లర వెబ్ సైట్ లు మరియు యూట్యూబ్ ఛానల్స్ ఇలాంటి వార్తలు రాస్తున్నాయి. ఇలాంటి వార్తలను ఎందుకు పుట్టిస్తారో అర్థం కావడం లేదు.  నా మీద మాత్రమే కాదు చాలా మంది సెలబ్రిటీల మీద ఇలాంటి వార్తలను క్రియేట్ చేస్తున్నారు. అలాంటి యూట్యూబ్ ఛానల్స్ మరియు వెబ్ సైట్ లపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను కోరుతున్నాం అని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: