పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "అజ్ఞాతవాసి" మూవీ తర్వాత కొంత కాలం పాటు సినిమా లకు దూరంగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అభిమానుల కోరిక మేరకు పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.  అందులో భాగంగా పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వకీల్ సాబ్ , భీమ్లా నాయక్ మూవీ లలో హీరో గా నటించాడు. ఈ రెండు మూవీ లు కూడా మంచి అంచనాలు నడుమ విడుదల అయ్యి ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించాయి.

ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ హరి హర వీరమల్లు లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసింది. ఈ మూవీ లో నిది అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , ఎం ఎం కీరవాణిమూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాలను చిత్ర బృందం చిత్రీకరిస్తుంది. ఈ మూవీ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ బుధవారం నుండి పవన్ కళ్యాణ్ కూడా ఈ క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా క్లైమాక్స్ సన్నివేశాలలో పవన్ కళ్యాణ్ తో తలపడే వ్యక్తులు ప్రస్తుతం వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మరియు క్రిష్ జాగర్లమూడి ఇద్దరికీ కూడా ఇదే మొట్ట మొదటి పన్ ఇండియా మూవీ కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: