మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం క్రాక్ మూవీ తో మంచి విజయం అందుకున్న రవితేజ ఆ ఫామ్ ను అలాగే కంటిన్యూ చేయడంలో కాస్త విఫలం అయ్యాడు. క్రాక్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత రవితేజ "ఖిలాడి" మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఖిలాడి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ తర్వాత రవితేజ "రామారావు ఆన్ డ్యూటీ" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. పర్వాలేదు అని అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ కూడా రవితేజ కు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే మిగిల్చింది.

ఇలా రెండు వరస అపజయాల తర్వాత రవితేజ నుండి ధమాకా సినిమా రాబోతుంది. త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ మూవీ లో రవితేజ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. భీమ్స్ సిసిరోలియో ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ చిత్ర బృందం ఈ మూవీ నుండి కొన్ని పాటలను మరియు కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది.

వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ నుండి "డు డు" అనే లిరికల్ వీడియో సాంగ్ ను నవంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సాంగ్ ను నవంబర్ 25 వ తేదీన సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: