నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ పేరు అందరికి తెలుసు..మొన్నీమధ్య త్రిపుల్ ఆర్ సినిమా తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు..ఆ సినిమా ప్రపంచ వ్యాప్థంగా మంచి టాక్ ను అందుకుంది.దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో కొమురం భీమ్ గా తారక్ అద్భుత నటన ప్రేక్షకులను ఫిదా చేసింది.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో ఉంటారో అందరికి తెలుసు. ఆయన డాన్స్ కు, డైలాగ్ డెలివరీకి, స్టైల్ కి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తారక్ లతో పాటు ఈ మధ్య టీవీ షోలతో కూడా ఆకట్టుకున్నారు.


ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 1కు హోస్ట్ గా వ్యవహరించి అలరించారు. తన మాటలతో ప్రేక్షకులను మెప్పించారు తారక్. అలాగే ఎవరు మీలో కోటీశ్వరులు అనే షోలో కూడా అలరించారు తారక్. అదేవిధంగా పలు వాణిజ్యప్రకటనలలో కూడా కనిపించారు. తాజాగా మరోసారి యాడ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు..ఈ యాడ్ సంబంధించిన షూటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యాడ్ లో తారక్ సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఇక ఈ యాడ్ లో ఒక కోర్ట్ సీన్ ను తెరకెక్కించారు. అయితే ఈ యాడ్ లో ఒక చిన్న డైలాగ్ చెప్పాల్సి ఉంటుంది..


కానీ తారక్ చాలా టెక్స్ తీసుకుంటారు. దాంతో ఎదురుగా ఉన్న రాహుల్ రామకృష్ణ ఆరు పేజీల డైలాగ్ ను సింగిల్ టెక్ లో చెప్తారు. ఈ చిన్న డైలాగ్ చెప్పలేక పోతున్నారేంటి అని ప్రశ్నిస్తాడు.. అందుకు తారక్.. ''చేప చిన్నదే అయినా ఎర పెద్దది వెయ్యాలి'' అని డైలాగ్ చెప్తాడు.డైలాగు పర్ఫెక్ట్ గా ఉండాలి అని చెప్పిన ఎన్టీఆర్ పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ డైలాగు మేకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు యంగ్ టైగర్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవనుంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వలో ఓ సినిమా చేస్తున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: