మళయాళ భామలకు తెలుగులో సూపర్ క్రేజ్ ఉంతుంది. ముంబై భామలేమో గ్లామర్ షో మీద దృష్టి పెడితే మళయాళ భామలు మాత్రం కథానాయిక ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తారు. స్టార్ సినిమాల్లో నటించినా సరే వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వస్తుంది. రీసెంట్ గా అదే పరిశ్రమ నుంచి వచ్చిన ఓ హీరోయిన్ చేసిన రెండు సినిమాలు హిట్టు పడినా అమ్మడి కెరీర్ మాత్రం ఆశించినంత జోష్ లో లేదు. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరు అంటే మళయాళ భామ సంయుక్త మీనన్.

తెలుగు ఎంట్రీ ఇవ్వడమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాతో వచ్చిన సం యుక్త మీనన్ భీంలా నాయక్ హిట్టు పడగా ఆ తర్వాత కళ్యాణ్ రాం హీరోగా వచ్చిన బింబిసార సినిమాతో కూడా హిట్ అందుకుంది. చేసిన రెండు సినిమాలు హిట్ కొట్టిన అమ్మడికి మరో ఛాన్స్ రాలేదు. త్రివిక్రం సమక్షంలో సినిమాలకు ఆమెని తీసుకోవాలని చూస్తున్నట్టు టాక్. మరి రెండు మంచి సినిమాలతో విజయాన్ని అందుకున్న సంయుక్త కు ఎందుకు అవకాశాలు రావట్లేదు అన్నది హాట్ న్యూస్ గా మారింది. అందానికి అందం.. అభినయానికి అభినయం ఉన్న సంయుక్త మీనన్ మరో మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది.

సంయుక్త మీనన్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయారు. అయితే ప్రస్తుతానికి సినిమాలేవి లేకపోయినా అమ్మడు సోషల్ మీడియాని ఫాలో అవుతున్నారు. భీంలా నాయక్, బింబిసార రెండు సినిమాలతో తనకంటూ ఓ ఐడెంటిటీ ఏర్పరచుకున్న సంయుక్త మీనన్ మరో లక్కీ ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది. తప్పకుండా అమ్మడు ఎదురుచూపులకు అనుగుణంగా ఓ మంచి అవకాశం వచ్చి తన రేంజ్ మరింత పెంచేలా చేయాలని ఆశిద్దాం. ప్రస్తుతం రెండు సినిమాలు డిస్కషన్ స్టేజ్ లొ ఉండగా టాలీవుడ్ కెరియర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటుంది అమ్మడు.


మరింత సమాచారం తెలుసుకోండి: