టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ గోల్డెన్ బిస్కెట్ లాంటిది. సినిమా టాక్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులు ధియేటర్లకు వస్తూ ఉంటారు. కరోనా పరిస్థితులు వల్ల రెండు సంక్రాంతి సీజన్స్ ను మిస్ చేసుకున్న టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రజలలో కరోనా భయాలు పూర్తిగా తొలిగిపోవడంతో ఈసారి రాబోతున్న సంక్రాంతికి గతంలో లానే జనం ధియేటర్లకు వచ్చి కాసులు కురిపించాలని ఆశ పడుతున్నారు.


దీనితో ఈసారి సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకోవడానికి చిరంజీవి బాలకృష్ణ లతో పాటు తమిళ టాప్ హీరోలు విజయ్ అజిత్ లతో పాటు అవకాశం ఉంటే అఖిల్ కూడ సంక్రాంతి రేస్ లో నిలబడటానికి గట్టిప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నిర్మాతల మండలి మటుకు సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు రావడానికి వీలులేదు అంటూ ప్రకటన ఇచ్చినప్పటికీ ఆప్రకటనను ఎవరు పట్టించుకోవడం లేదు.


అల్లు అరవింద్ లాంటి ప్రముఖ నిర్మాత డబ్బింగ్ సినిమాల జోరును ఎవరు ఆపలేరు అని ఓపెన్ గా చెప్పడంతో సంక్రాంతికి రెండు తెలుగు భారీ సినిమాలు మరో రెండు తమిళ భారీ డబ్బింగ్ సినిమాలు ఒకేసారి విడుదల అవుతున్న పరిస్థితులలో ధియేటర్ల కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. చిరంజీవి ‘వాల్టేర్ వీరయ్య’ కు అదేవిధంగా విజయ్ ‘వారసుడు’ మూవీకి ధియేటర్లు దొరికే విషయంలో ఎటువంటి సమస్యలు ఎదురౌనప్పటికీ బాలయ్య ‘వీర సింహారెడ్డి’ కి మాత్రం మంచి ధియేటర్స్ దొరకడం లేదు అన్నప్రచారం జరుగుతోంది.


బాలయ్య చిరంజీవి సినిమాలను నిర్మిస్తున్నది మైత్రీ మూవీస్ అయినప్పటికీ చిరంజీవి బాలయ్యల ఒత్తిడి వల్ల మైత్రీ మూవీస్ సంస్థ తమ భారీ సినిమా పై తమ మరో భారీ సినిమాను విడుదలచేయవలసిన విచిత్ర పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. చిరంజీవి బాలకృష్ణ లు సంక్రాంతి రేస్ లో పోటీపడటం గతంలో అనేకసార్లు జరిగింది. అయితే ఈసంక్రాంతి సెంటిమెంట్ చిరంజీవి కంటే బాలయ్యకు ఎక్కువగా కలిసి వచ్చింది అన్న విశ్లేషణలు కూడ ఉన్నాయి. దీనితో సంక్రాంతి రేస్ గురించి అటు బాలకృష్ణ ఇటు చిరంజీవి భయపడని పరిస్థితులలో ఈరేస్ నుండి ఎవరు వెనక్కు తగ్గుతారు అన్నవిషయమై ప్రస్తుతానికి క్లారిటీ లేకపోవడంతో ఇండస్ట్రీ వర్గాలు తెగ కన్ఫ్యూజ్ అవుతున్నట్లు తెలుస్తోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: