ఈ శుక్రు వారం చాల డిఫరెంట్ కథలతో తీసిన సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ సగటు ప్రేక్షకుడు ఏసినిమాను పట్టించుకునే ఆలోచనలు కనిపించకపోవడంతో ఇండస్ట్రీ వర్గాలు షాక్ అవుతున్నాయి. తమిళనాడులో రిలీజ్ అయి బ్లాక్ బష్టర్ హిట్ అందుకున్న ‘లవ్ టుడే’ తెలుగు డబ్బింగ్ తో పాటు అల్లరి నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ సినిమాలతో పాటు వరుణ్ ధావన్ బాలీవుడ్ మూవీని తెలుగులో ‘తోడేలు’ మూవీగా డబ్ చేస్తున్నారు.


‘లవ్ టుడే’ మూవీ నేతియువత ఆలోచనలకు దగ్గరగా ఉంటే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానేకం’ ఒక వాస్తవ సంఘటనకు సినిమా రూపం ఇక ‘తోడేలు’ మూవీని భారీ బడ్జెట్ తో త్రీడీ లో తీసారు. ఒకమనిషిని తోడేలు కరిస్తే ఆవ్యక్తి తోడేలు లక్షణాలతో మారిపోతే ఎలా ఉంటుంది అన్న ఊహ చుట్టూ తీసిన సినిమా ఇది. ఈసినిమాని తెలుగు రాష్ట్రాలలో విడుదల చేస్తున్న అల్లు అరవింద్ ‘కాంతార’ రేంజ్ లో సూపర్ హిట్ అవుతుందని ఆశపడుతున్నాడు.


ఈమూడు సినిమాలకు సంబంధించి పబ్లిసిటీ బాగా ఇచ్చినప్పటికీ బుక్ మై షోలో ఈమూడు సినిమాలకు సంబంధించిన టిక్కెట్లు వేగంగా వెళ్ళకపోవడంతో రొటీన్ సినిమాలకు భిన్నంగా వస్తున్న ఈమూడు సినిమాలను ప్రేక్షకులు పట్టించుకోరా అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలకు వస్తున్నాయి. గతవారం విడుదలైన ‘మసూద’ ‘గాలోడు’ సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ప్రస్తుతానికి కలక్షన్స్ ఒక మాదిరిగా ఉన్నాయి.


మరీ ముఖ్యంగా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘గాలోడు’ సినిమా మొదటివారంలోనే బ్రేక్ ఈవెన్ కు వచ్చేసింది అంటు వస్తున్న వార్తలు విని ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి. ఈ పరిస్థితులలో ఏసినిమా హిట్ అవుతుందో మరే సినిమా ఫ్లాప్ గా మారుతుందో ఎవరికీ తెలియక ఇండస్ట్రీ వర్గాలు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఈవారం విడుదల అవుతున్న ఈమూడు డిఫరెంట్ సినిమాలలో ఏదో ఒకటి హిట్ టాక్ తెచ్చుకోకపోతే డిఫరెంట్ సినిమాలు తీయడానికి కూడ నిర్మాతలు భయపడిపోయే పరిస్థితులు ఏర్పడవచ్చు..  


మరింత సమాచారం తెలుసుకోండి: