టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ‘అల వైకుంఠ పురములో’ మూవీ ఒక ట్రెండ్ సెటర్. ఈ మూవీ తరువాత అల్లు అర్జున్ గ్రాఫ్ బాగా పెరిగింది. ఇప్పుడు ఈ మూవీని హిందీలో కార్తిక్ ఆర్యన్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ‘షెహజాడ’ అన్న పేరుతో రీమేక్ కాబడుతున్న ఈమూవీని వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో వేలంటైన్స్ డే సందర్భంగా విడుదల చేస్తున్నారు.


ఈమూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగానే అల్లు అర్జున్ నామస్మరణ విపరీతంగా పెరిగింది. ఈబాలీవుడ్ మూవీ ట్రైలర్ ను ఒరిజనల్ ‘అల వైకుంఠ పురములో’ మూవీ ట్రైలర్ తో పోలుస్తూ బన్నీ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతమైన హడావిడి మొదలుపెట్టారు. కార్తిక్ ఆర్యన్ బాడీ లాంగ్వేజ్ కానీ నటన కానీ ఎక్కడా బన్నీ స్థాయిని చేరుకునేలా లేదు అంటూ అతడి అభిమానులు కార్తిక్ ఆర్యన్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో హడావిడి మొదలుపెట్టారు.


దీనితో మళ్ళీ ‘అల వైకుంఠ పురములో’ మూవీ ట్రెండింగ్ గా మారడమే కాకుండా మళ్ళీ ఆసినిమాకు సంబంధించిన పాటలను బన్నీ నటనను త్రివిక్రమ్ సమర్థతను మళ్ళీమళ్ళీ గుర్తుకు చేసుకునేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. వాస్తవానికి ‘అల వైకుంఠ పురములో’ మూవీ కథలో చెప్పుకో తగ్గ కొత్తదనం లేదు అయితే త్రివిక్రమ్ అద్భుతమైన టేకింగ్ తో పాటు తమన్ అందించిన పాటలు బన్నీ బాడీ లాంగ్వేజ్ ఆమూవీని బ్లాక్ బష్టర్ హిట్ గా మార్చాయి.


ఈసినిమా సూపర్ హిట్ అవ్వడంతో అనేకమంది ఈ మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేయాలని ప్రయత్నించారు. అయితే ఆ రైట్స్ ఎవరికీ ఇవ్వకుండా అల్లు అరవింద్ తానే సొంతంగా తన గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఇప్పుడు కార్తిక్ ఆర్యన్ తో హిందీలో తీస్తున్నాడు. ఈమూవీతో అతడి కెరియర్ దశ తిరుగుతుందని కార్తిక్ ఆర్యన్ భావిస్తున్నాడు. మరి బాలీవుడ్ ప్రేక్షకులు ఈమూవీ పై ఎలా సప్న్దిస్తారో చూడాలి..మరింత సమాచారం తెలుసుకోండి: