టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ సినిమాలు గతంలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవి. అప్పట్లో ఏడాదికి దాదాపుగా ఏడు ఎనిమిది సినిమాలు విడుదల చేసేవారు అల్లరి నరేష్. గడిచిన కొద్ది సంవత్సరాల క్రితం నుంచి అల్లరి నరేష్ కు సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న సమయంలో నాంది సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు అలాంటి సక్సెస్ ని కంటిన్యూ చేయాలని అల్లరి నరేష్ మరొకసారి ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాతో మరొకసారి ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.


సినిమా మొత్తం ఎలక్షన్ల చుట్టూ జరిగే నేపథ్యంలో కథ ఉన్నట్లుగా ట్రైలర్, టీజర్ చూస్తే మనకి అర్థమవుతుంది. ఇక ఈ రోజున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఈ సినిమా అల్లరి నరేష్ మార్కెట్కు తగ్గట్టుగానే లిమిటెడ్ థియేటర్లలో విడుదల చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా మొత్తం కలుపుకొని 400కు పైగా థియేటర్లలో విడుదల చేశారు ప్రపంచవ్యాప్తంగా 500కు పైగా థియేటర్లలో విడుదలైనట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా సక్సెస్ టాక్ అందుకోవాలి అంటే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా టార్గెట్ ను అందుకోవాల్సిందే.


ప్రపంచవ్యాప్తంగా ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం సినిమా దాదాపుగా రూ.4 కోట్ల రూపాయల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాలి అంటే కచ్చితంగా రూ.4.50 కోట్ల రూపాయలను కలెక్షన్ సాధించాల్సి ఉంటుంది. నాంది సినిమా తరహాలో ఈ సినిమా కూడా అల్లరి నరేష్ వరించింది అంటే ఇదేమి పెద్ద విషయం కాదని ఆయన అభిమానులు భావిస్తున్నారు. చివరిగా అల్లరి నరేష్ సుడిగాడు చిత్రంతో రూ. 30 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టారు. నాంది సినిమా కూడా నిర్మాతల కు లాభాన్ని తెచ్చింది మరి ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ఎలా ఉంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: