అక్కినేని నాగార్జున మంచి నటుడు మాత్రమే కాకుండా మంచి వ్యాపారవేత్త కూడ. ఇప్పటికే రకరకాల వ్యాపారాలలో భారీ పెట్టుబడులు పెట్టిన నాగార్జున హీరోగా కంటే వ్యాపారవేత్తగానే ఎక్కువగా గణిస్తాడు అని అంటారు. గత కొన్ని సంవత్సరాలుగా నాగార్జున కెరియర్ ఏమాత్రం బాగాలేదు. అతడి కొడుకులు నాగచైతన్య అఖిల్ ల కెరియర్ కూడ అంత బాగా లేదు.
దీనితో సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ తన చేతిలో ఉండి కూడ నాగ్ తన పిల్లలతో భారీ సినిమాలను తీయలేకపోతున్నాడు. గతంలో ఇదే సంస్థ బ్యానర్ పై ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చిన చరిత్ర ఈ సంస్థకు ఉంది. సాధారణంగా అన్నపూర్ణ బ్యానర్ పై బయట హీరోలతో నాగార్జున సినిమాలు తీయడు. అయితే ఈసారి తన పద్ధతి మార్చుకున్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం వరస విజయాలతో దూసుకుపోతున్న అడవి శేషు తో ఒక భారీ బడ్జెట్ మూవీని నాగార్జున తన సొంత బ్యానర్ పై తీస్తున్నట్లు తెలుస్తోంది. ఒక సూపర్ హిట్ మళయాళ మూవీకి రీమేక్ గా త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈమూవీకి ఒక యంగ్ డైరెక్టర్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రారంభం అయింది అంటున్నారు.
‘మేజర్’ సూపర్ సక్సస్ తరువాత అడవి శేషు మారుమ్రోగి పోతోంది. వచ్చేవారం విడుదల కాబోతున్న ‘హిట్ 2’ మూవీ కూడ సూపర్ హిట్ అయితే ఇక శేషు క్రేజ్ తార స్థాయికి చేరుకుంటుంది. అవకాశాలు చాల వస్తున్నప్పటికీ అన్ని సినిమాలు ఒప్పుకోకుండా శేషు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ కూడ శేషు తో సినిమా తీస్తోంది అంటే అతడి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం అవుతుంది. ఈ మూవీ హిట్ అయితే అన్నపూర్ణ స్టూడియోస్ మరింతమంది టాప్ హీరోలతో ధైర్యంగా సినిమాలు తీసి ఒకనాటి తమ సంస్థ గుర్తింపును తిరిగి పొందే అవకాశం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: