ప్రస్తుతం సౌత్ లోనే బిగ్గెస్ట్ రియాలిటీ డాన్స్ షోగా కొనసాగుతుంది ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ షో. దాదాపు గత 14 ఏళ్ల నుంచి కూడా ఎంతో సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంది అని చెప్పాలి.  అంతేకాదు ఇక ఎంతోమంది డాన్సర్లను డాన్స్ మాస్టర్ లుగా మార్చి ఇక సరికొత్త జీవితాన్ని ప్రసాదించింది ఈ కార్యక్రమం అని చెప్పాలి. ఇక ఇప్పుడు ప్రసారం అవుతున్న ఢీ డాన్సింగ్ ఐకాన్ కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం సెమీఫైనల్స్ జరుగుతున్నాయి.


 ఈ క్రమంలోనే ఢీ షోలో టైటిల్ గెలవాలని టార్గెట్ పెట్టుకున్న కొరియోగ్రాఫర్స్ అందరూ కూడా తమ  ప్రతిభను బయటకు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్లు చేసే డాన్సులు చూడటానికి ప్రేక్షకులకు రెండు కళ్ళు సరిపోవడం లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇటీవల కాలంలో కంటెస్టెంట్లు మాత్రమే కాదు ఢీ షోలో టీం లీడర్ గా ఉన్నవారు సైతం డాన్స్ లతో ఆకట్టుకుంటున్నారు. గతవారం ఎపిసోడ్లో అఖిల్ తో పాటు మరో లేడీ టీమ్ లీడర్ కూడా డాన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించారు.


 ఈ క్రమంలోనే ఈ ఇద్దరు టీం లీడర్ల డాన్స్ చూసిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను కూడా డాన్స్ చేస్తాను అంటూ హైపర్ ఆది శపథం చేశాడు అన్న విషయం తెలిసిందే. అయితే హైపర్ ఆది ఇలా అన్న సమయంలో ఏదో జోక్ గా అని ఉంటాడులే అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే మిగతా టీం లీడర్లతో పోల్చి చూస్తే హైపర్ ఆదికి డాన్స్ పై అంతపట్టులేదు. కానీ ఇటీవల గత ఎపిసోడ్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు హైపర్ ఆది.  ఇటీవల విడుదలైన ప్రోమోలో భాగంగా హైపర్ ఆది అదిరిపోయే పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక అతని పర్ఫామెన్స్ కి జడ్జిలు కూడా ఫిదా అయిపోయారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: