మాస్ కా దాస్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా నటిస్తున్న చిత్రం ధమ్కీ.. సొంత బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ సినిమాకి ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కు ఊహించిన విధంగా రెస్పాన్స్ లభించింది. ఇటీవల విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన తాజా చిత్రం లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా "ఓరి దేవుడా".. ఇప్పటికే ఆహా లో స్ట్రీమ్ ఆవుతూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.


ఇదిలా ఉండగా ప్రస్తుతం విశ్వక్ సేన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న సినిమా ధమ్కీ. ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ పోస్టర్ ను  విశ్వక్ సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. క్లాస్ మరియు మాస్ లుక్ లో బాగా ఆకట్టుకుంటున్నారు విశ్వక్. ఒక శ్రీమంతుడికి ఎదురైన సమస్యను ఒక సాధారణమైన వెయిటర్ ఎలా పరిష్కరించాడు అనేది ఈ సినిమా కథాంశం.  తాజాగా ఈ సినిమా రిలీజ్ డేటు ప్రకటించారు.  తెలుగు, తమిళ్, మలయాళం,  హిందీ భాషల్లో ఈ సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక పోస్టర్ను కూడా విడుదల చేయడం జరిగింది.


పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న ఈ సినిమాలో నివేదా పేతురాజు హీరోయిన్గా నటిస్తోంది.  అలాగే ఇతర పాత్రలలో రావు రమేష్ , పృథ్వీరాజ్ , హైపర్ ఆది నటిస్తున్నారు. విశ్వక్ సేన్ సినిమా బ్యానర్ లో వన్మై క్రియేషన్స్ వారు కూడా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తూ ఉండడం గమనార్హం. మొదటిసారి పాన్ ఇండియా రేంజ్ లో తన సినిమాను విడుదల చేయబోతున్న విశ్వక్ ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటాడో చూడాలి. ఏది ఏమైనా ఓరి దేవుడా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈయన ఈ సినిమాతో కూడా మరింత పాపులారిటీని దక్కించుకుంటాడు అని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: