జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్న కమీడియన్ లలో సుడిగాలి సుదీర్ ఒకరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచు గుర్తింపును తెచ్చుకొని ఎంతో మంది బుల్లితెర అభిమానుల మనసు దోచుకుని ఆ తర్వాత అనేక టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించడం మాత్రమే కాకుండా ఎన్నో సినిమాలలో నటించి కూడా ప్రేక్షకులను సూటిగాలి సుదీర్ అలరించాడు. కొంతకాలం కృతమే సుడిగాలి సుదీర్ సాప్ట్ వేర్ సుధీర్ అనే మూవీ లో హీరో గా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. దానితో కొంత కాలం పాటు హీరో పాత్రాలకు గ్యాప్ తీసుకున్న సుడిగాలి సుదీర్ తాజాగా గాలోడు అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కి రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించగా ,  గ్నెహా సిప్పి ఈ మూవీ లో సుధీర్ సరసన హీరోయిన్ గా నటించింది.

మూవీ మంచి అంచనాల నడుమ సెప్టెంబర్ 18 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త మిక్స్ డ్ టాక్ లభించినప్పటికీ , ఈ మూవీ కి కలెక్షన్ లు మాత్రం బాగానే లభించాయి. ఈ మూవీ మాస్ ఎంటర్టైనర్ మూవీ గా తెరకెక్కింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి క్లీన్ హిట్ గా నిలిచింది. 

దానితో తాజాగా నాగబాబు సుదీర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మూవీకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది అని ,  సుడిగాలి సుదీర్ మాస్ హీరో అవుతాడు అని ఎనిమిది సంవత్సరాల క్రితమే జ్యోతిషం చెప్పానని అది ఇప్పుడు నిజమైనందుకు సంతోషంగా ఉందే అని నాగబాబు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: