విజయ్ దేవరకొండ: ఇక మన తెలుగు స్టార్  హీరోలందరూ కూడా వాళ్ళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వారు ఏదోక సినిమాతో బిజీ అయ్యిు ఉన్నారు. కానీ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మాత్రం కన్ఫ్యూజన్ లో ఉన్నాడు.లైగర్  సినిమా ఇచ్చిన సాలిడ్  షాక్ కి ఇంకా డైలమాలోనే ఉన్న విజయ్  దేవరకొండ ఇప్పుడిప్పుడే బయటికొస్తున్నాడు. తెలుగులో వర్కవుట్ అయ్యే పరిస్తితులు లేవనుకున్నాడో ఏమో ముంబైలోనే పని వెతుక్కునే పనిలో ఉన్నాడు రౌడీ హీరో విజయ్  దేవరకొండ.విజయ్ దేవరకొండ లైగర్  సినిమా దెబ్బతో చాలా అంటే చాలా డీలా పడిపోయాడు. ఎన్నో భారీ అంచనాలతో పాన్ ఇండియా వైడ్  విడుదల అయిన లైగర్  సినిమా అసలు ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యి విజయ్ ఆశల మీద నీళ్లు చల్లింది. దాంతో విజయ్ దేవరకొండ ఆ ట్రాన్స్ లో నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నాడు. లైగర్  సినిమా ఆడలేదు. ఆ తర్వాత అనౌన్స్ చేసిన జనగణమన సినిమా కూడా ఆగిపోయింది.


ప్రస్తుతం శివనిర్వాణతో చేస్తున్న ఖుషీ సినిమా కూడా సమంతకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో బ్రేక్ ఇచ్చింది. దీంతో ప్రస్తుతం విజయ్  దేవరకొండ ఖాళీ గానే ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది.తాజాగా ముంబైకి విజయ్  మళ్ళీ మకాం మార్చేసినట్టు తెలుస్తుంది.అయితే ముంబైకి విజయ్ దేవరకొండ ఓ యాడ్ షూట్ కోసం వెళ్లాడు.ఇప్పటికే చాలా కమర్షియల్ యాడ్స్ చేస్తున్న విజయ్  ఇక ఇప్పుడు లేటెస్ట్ గా మరో యాడ్ చేయబోతున్నాడు. విజయ్  దేవరకొండ యాడ్ షూట్ తో పాటు బాలీవుడ్ లో స్టోరీ సిట్టింగ్స్ కూడా ప్లాన్ చేసుకున్నాడు. ఇప్పటికే యాక్షన్ ఓరియంటెడ్  సినిమాలతో దెబ్బతిన్న రౌడీ హీరో డిఫరెంట్ జానర్ లో తన సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఆల్రెడీ తెలుగులో అందరు స్టార్ డైరెక్టర్లు బిజీ అయ్యి ఉండడంతో బాలీవుడ్ డైరెక్టర్లతో మూవీ డిస్కషన్స్  చేసుకుంటున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: