తమిళంలో నవంబర్ 4 వ తేదీన రిలీజై మంచి పాజిటివ్ టాక్ తో హిట్ అయ్యి మంచి వసూళ్లను దక్కించుకుంటున్న లవ్ టుడే సినిమా తెలుగులో కూడా డబ్ అయి ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.మరి తమిళ ఆడియెన్సుని అంతలా అలరించిన ఈ సినిమా ఇక్కడి ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ సినిమా అసలు కథ ఏంటని ట్రైలర్లోనే చెప్పేసినా సినిమా కథనం మాత్రం ఆసక్తికరంగానే సాగింది. ఫస్టాఫ్ అంతా సరదా సరదాగా ఇంకా ఫుల్ కామెడీగా నడిచింది. సెకండాఫ్ కూడా ఫన్ ఫ్లేవర్ అనేది ఎక్కడా కూడా మిస్సవ్వకుండా ట్రాక్ తప్పకుండా సాగినా చివరి ఇరవై నిమిషాలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. దాంతో ఫస్టాఫ్ తో పోలిస్తే సెకండాఫ్ కాస్త ల్యాగ్ అనిపించినా మొత్తంగా మాత్రం ప్రేక్షకుల్ని నవ్విస్తూనే మంచి సందేశమిచ్చిందీ ఈ సినిమా.


ఇక ప్రదీప్ రంగనాథనే ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ తో పాటు హీరోగా కూడా చేయడం చాలా వరకు ప్లస్ అయ్యింది. దర్శకుడిగా మొదటి సినిమా కోమాలితోనే తన ప్రతిభను నిరూపించుకున్న ప్రదీప్ ఈ మూవీతో యాక్టర్ గానూ కోలీవుడ్ ఇంకా టాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. హీరోయిన్ ఇవన కూడా ఈ సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడం ఖాయంలా కనిపిస్తుంది. ముఖ్యంగా యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం అయితే ఈ సినిమాకి ప్రధాన బలం. ఎమోషనల్ ఇంకా అలాగే కామెడీ సీన్లు అన్న తేడా లేకుండా అన్ని సన్నివేశాలకీ కూడా చాలా అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. యోగిబాబు, సత్యరాజ్ ఇంకా అలాగే రాధిక తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు.మొత్తానికి ఈ సినిమా చాలా బాగానే ఆకట్టుకుంది.మొత్తానికి యూత్ కి అయితే ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. బాగా కనెక్ట్ అవుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: