ఊహలు గుసగుసలాడే సినిమాతో మొదటిసారిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ రాశి ఖన్నా. మొదటి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలోనే యువ హీరోయిన్లలో క్రేజీ హీరోయిన్ గా పేరు పొందింది. ఒకవైపు పలు సినిమాలు నటిస్తూనే మరొకవైపు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. అంతేకాకుండా డిజిటల్ స్పేస్ లో కూడా తన సొంత చాటుతోంది. ఈ ముద్దుగుమ్మ.రాశి ఖన్నా రుద్ర ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నేస్ అనే వెబ్ సిరీస్ తో ఓటీటి లోకి ఎంట్రీ ఇచ్చింది.


బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఇందులో నటించారు. సైకాలజికల్ క్రైమ్ ట్రిల్లర్ కథాంశంతో రాకేష్ మపుష్కర్ ఈ వెబ్ సిరీస్ ని తేరకేకించారు. ప్రముఖ ఓటీటి ప్లాట్ఫారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇది స్ట్రిమింగ్స్ కాబోతోంది. ఈ సిరీస్ ఆడియన్స్ కు మంచి రెస్పాన్స్ అందించింది. లూధర్ అనే పాపులర్ బ్రిటిష్ వెబ్ సిరీస్ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. ఇందులో రాశి ఖన్నా నెగిటివ్ సెడ్ లో నటించింది. ఇందులో రాశి ఖన్నా పాత్ర అద్భుతంగా నటించింది అని చెప్పవచ్చు. తాజాగా ఒక ప్రైవేట్ మీడియా హౌస్ నుండి నెగటివ్ రూల్ లో ఉత్తమ నటి కేటగిరీలో అవార్డు అందుకుంది.


ఇక అవార్డును అందుకున్న సందర్భంగా రాశి ఖన్నా ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ద్వారా తన ఆనందాన్ని తెలియజేసింది. చేతిలో అవార్డు ఉన్న ఒక ఫోటోని తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ ప్రేక్షకులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసింది. అజయ్ దేవగన్ తో సహా రుద్ర ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ టీ మొత్తానికి కృతజ్ఞతలను తెలియజేసింది. ఇది చాలా ప్రత్యేకమైనది రుద్ర కోసం నెగటివ్ రోళ్ళు ఉత్తమ నటి అవార్డు తనకి చాలా సంతోషాన్ని ఇస్తుందని ధన్యవాదాలు తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: