మళయాళ భామ కీర్తి సురేష్ టాలీవుడ్ లో హ్యాండ్సం హీరో ఎవరంటే షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. ఇంతకీ అమ్మడి దృష్టిలో హ్యాండ్సం హీరో ఎవరో తెలుసా దగ్గుబాటి వారసుడు రానా అట. రానాతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ పాల్గొన్న టైం లో కీర్తి సురేష్ ఈ ఆన్సర్ ఇచ్చింది. ఎదురుగా రానా ఉన్నాడని చెప్పిందో లేక నిజంగానే రానా అంటే ఇష్టమేమో కానీ రానానే తన కు టాలీవుడ్ లో నచ్చే హ్యాండ్సం హీరో అని అన్నది కీర్తి సురేష్. టాలీవుడ్ హ్యాండ్సం హల్క్ గా రానా ఎత్తుకి ఎత్తు పొడవు ఉంటాడు. అందుకే అతను ఎలాంటి పాత్రలో అయినా అదరగొట్టేస్తాడు.

బాహుబలి పాత్ర అంత ఎలివేట్ అవడానికి కారణం ఇవతల భళ్లాలదేవుడుగా చేసిన రానా కూడా అంత బలంగా ఉండటమే. ఆ సినిమాలో హీరో ప్రభాస్ కి ఈక్వల్ గా రానాకి సూపర్ క్రేజ్ వచ్చింది. రానా కి ఆల్రెడీ బాలీవుడ్ లో ఫ్యాన్స్ ఉండగా బాహుబలి తర్వాత అది మరింత పెరిగింది. అంతేకాదు తెలుగు లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న ప్రతి హీరోయిన్ కూడా రానా గురించే అడుగుతారట. ఒకసారి అల్లు అర్జున్ కూడా ఈ అనుభవం ఎదురైందట. బన్నీనే రానా నెంబర్ కోసం ఒక హీరోయిన్ అడిగిందట.

అలా అభిమానులనే కాదు హీరోయిన్స్ ని కూడా ఎట్రాక్ట్ చేస్తున్నాడు రానా. హీరోగా ఒక ఇమేజ్ లో ఉండిపోకుండా నటుడిగా ఎలాంటి పాత్రలనైనా చేయాలని ఒక పంథాలో కొనసాగుతున్నాడు రానా. దగ్గుబాటి వారసుడిగా వెంకటేష్ తర్వాత హీరోగా నిలదొక్కుకున్న రానా ఫ్యూచర్ లో మరెన్నో ప్రయోగాత్మక సినిమాలు చేయాలని చూస్తున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ తో రానా భారీ ప్రాజెక్ట్ లు చేసినా వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఎందుకో రానా ఆ సాహసం చేయట్లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: