రిషబ్ శెట్టి నటించి డైరెక్ట్ చేసిన కాంతార మూవీ ఓ పక్క రికార్డులు సృష్టిస్తూ ఉంది. 16 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 400 కోట్ల దాకా రాబట్టింది అంటే అది మాములు విషయం కాదు. తెలుగులో అయితే అన్ని సినిమాల్లానే అది కూడా అనుకోగా సినిమా చూసిన అందరు పూనకాలు తెచ్చుకుని సూపర్ మౌత్ టాక్ తో సెన్సేషనల్ హిట్ అయ్యింది. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే సినిమా చివరి 20 నిమిషాలు ఒక ఎత్తు. రిషబ్ శెట్టి నట విశ్వరూపం తో రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాడు. ముఖ్యంగా వరాహరూపం సాంగ్ సినిమాకు ఆయువు పట్టు.

రీసెంట్ గా అమేజాన్ ప్రైం ఓటీటీ రిలీజైన ఈ మూవీలో ఆ సాంగ్ మిస్ అయ్యింది. వరాహరూపం సాంగ్ కేరళకు చెందిన తైక్కుడం బ్రిడ్జ్ అనే మ్యూజిక్ బ్రాండ్ చేసిన నవసర సాంగ్ కి దగ్గరగా ఉందని.. వరాహరూపం కాపీ సాంగ్ అంటూ కేసు నమోదు చేశారు. కోర్ట్ లో కేసు ఉన్న కారణంగా సినిమా నుంచి ఆ పాట తొలగించారు. దాదాపు పది పదిహేను రోజులుగా ఆ పాట లేకుండానే థియేట్రికల్ రన్ నడుస్తుంది. అయినా సరే సినిమా వసూళ్లను ఆపలేకపోయారు. ఇక లేటెస్ట్ గా కోర్ట్ కూడా క్లియరెన్స్ ఇచ్చేసింది. కాంతార మూవీలో వరాహ రూపం సాంగ్ కి కోర్ట్ అనుకూలంగా స్పందించింది.

ఈ పాట లేకుండా అమేజాన్ ప్రైం లో చూసిన వారు పాట యాడ్ చేశాక మళ్లీ మళ్లీ చూడాలని అనుకుంటున్నారు. ఏది ఏమైనా కాంతార కు ఉన్న అడ్డు తొలగిపోయింది. డిజిటల్ స్ట్రీమింగ్ లో కూడా కాంతార రికార్డుల మీద కన్నేసింది. తప్పకుండా ఈ మూవీ ఇక్కడ కూడా సంచలనాలు సృష్టిస్తుందని చెప్పొచ్చు. ఇక మరోపక్క ఈ మూవీ శాటిలైట్ రైట్స్ ని భారీ రేటుకి పొందింది స్టార్ మా. తప్పకుండా సినిమా టెలికాస్ట్ అయితే మాత్రం అక్కడ కూడా రికార్డ్ టి.ఆర్.పి వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. కాంతార ఒక్క సినిమాతో తెలుగులో రిషబ్ శెట్టి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: