పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమా ప్రభాస్ కెరియర్ లో అత్యంత కీలకమని చెప్పవచ్చు.ఇక  ప్రభాస్ లో ఉన్న సరికొత్త యాంగిల్ ని డైరెక్టర్ పూరి పరిచయం చేశారు.అయితే ఇందులో హీరోయిన్ గా త్రిష ,కన్నడ హీరోయిన్ సంజన గల్రానీ నటించారు. బుజ్జిగాడు సినిమాలో త్రిష చెల్లెలి పాత్రలో అద్భుతంగా నటించింది. కాగా టాలీవుడ్ లో నటించిన సినిమాలు తక్కువే అయినప్పటికీ యువతలో ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం భారీగానే సంపాదించుకుంది.ఇక  ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ కుర్రకారుల గుండెల్లో

 గుబులు రేపేలా కనిపిస్తూ ఉంటుంది. స్టార్ హీరోయిన్ గా ఎదగాలనుకొని చాలా కలలు కన్న ఈ ముద్దుగుమ్మ అనుకున్నంత స్థాయిలో తన కెరీయర్ని కొనసాగించలేకపోయింది.అయితే సంజన గల్రానీ ఎక్కువగా సెకండ్ లీడ్స్ పాత్రలోనే నటించింది.ఇక  దీంతో ఈ ముద్దుగుమ్మ డిమాండ్ పూర్తిగా పడిపోయింది. అయితే  ప్రస్తుతం కొన్ని భాషలలో పలు చిత్రాలు చేస్తోంది తమిళ్, మలయాళం వంటి భాషలలో కూడా నటిస్తోంది. ఇక చివరిగా దండుపాళ్యం -3 లో నటించింది ఈ సినిమా విడుదల ఇప్పటికి కొన్ని సంవత్సరాలు అవుతోంది.

కాగా  తెలుగులో ఈ ముద్దుగుమ్మకు ఎలాంటి అవకాశాలు రాలేదు. దీంతో కన్నడ, తమిళ్ వంటి భాషలలో మాత్రమే కొన్ని సినిమాలలో నటిస్తూ తన కెరీర్ ని ముందుకు సాగిస్తోంది.ఇదిలావుంటే తాజాగా మణిశంకర్ అనే సినిమాలో తెలుగులో నటించబోతోంది అన్నట్లుగా తెలుస్తోంది.ఇక ఈ చిత్రంలో హీరోగా శివ కంఠమనేని నటిస్తూ ఉన్నారు.అయితే  ఇందులో అవకాశం రావడంతో కాస్త సంజన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే కరోనా తరువాత తనకి ఈ సినిమా అవకాశం వచ్చిందని ఈ చిత్రంలో తన ప్రణాళికతో చాలా చక్కగా పూర్తి చేస్తానని తెలియజేస్తోంది.ఇక యాక్టింగ్ పరంగా బాగానే ఆకట్టుకున్న పెద్దగా అదృష్టం రాలేదు. మరి ఈ చిత్రంతోనైనా అదృష్టం కలిసొస్తుందేమో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: