ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ఎంతలా పాపులారిటీ సంపాదించిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు . దాదాపు గత దశాబ్ద కాలం నుంచి కూడా బుల్లితెర  ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కామెడీని పంచుతూ కడుపుబ్బ  నవ్విస్తుంది అని చెప్పాలి. ఇలా ఏకంగా బుల్లితెర ప్రేక్షకులందరికీ ఎంటర్టైన్మెంట్ పంచుతూ కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారి పోయింది ఈ కార్యక్రమం అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. అయితే కేవలం బుల్లితెర ప్రేక్షకులను అలరించడమే కాదు ఇండస్ట్రీ  లోకి రావాలనుకునే ఎంతో మంది ఆప్ కమింగ్ కమెడియన్స్ కి కొత్త లైఫ్ ప్రసాదించింది జబర్దస్త్.


 అయితే కేవలం అప్కమింగ్ కమీడియన్స్ మాత్రమే కాదు అప్పటికే ఇండస్ట్రీ లో ఎన్నో అవకాశాలు అందుకుని స్టార్లుగా వెలుగొంది ఇక తర్వాత కాలం  లో మాత్రం అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న వారికి సైతం చేర దీసింది జబర్దస్త్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే తాగుబోతు రమేష్ గా ఇండస్ట్రీ లో ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ రమేష్ ఇప్పుడు జబర్దస్త్ లో టీం లీడర్ గా కొనసాగుతున్నాడు. అదే సమయం లో ఇక ఇండస్ట్రీ లో సీనియర్ నటి గా కొనసాగుతున్న అన్నపూర్ణమ్మ సైతం ఈటీవీలో కార్యక్రమాలలో సందడి చేస్తుంది.


 అయితే జబర్దస్త్ లో ఎప్పుడు సరికొత్త స్కిట్లతో ప్రేక్షకులను నవ్వించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక పోతే ఇటీవల ఇంకాస్త కొత్తగా ఆలోచించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేశారు అని చెప్పాలి. ఈ క్రమం లోనే ఇటీవల విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో లో భాగం గా ఏకంగా సీనియర్ నటి అన్నపూర్ణమ్మకు పెళ్లి చూపులు నిర్వహిస్తున్నట్లుగా ఒక స్కిట్ చేశారు. ఇక ఇందులో అన్నపూర్ణమ్మ సహా మరికొంతమంది కమెడియన్స్ వేసిన పంచులు అందరిని నవ్వుస్తూ ఉన్నాయ్. ఇక ఇది చూసిన ప్రేక్షకులు ఇది కదా వెరైటీ అంటే అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: