ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే చాలా నెగిటివిటీ ఉంది. ఈ సినిమా షూటింగ్ వేగంగానే పూర్తైనా ఈ సినిమా టీజర్ విషయంలో నెటిజన్ల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు అయితే వ్యక్తమయ్యాయి. మేకర్స్ చెప్పిన బడ్జెట్ కు టీజర్ క్వాలిటీకి ఏ మాత్రం కూడా పొంతన లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వచ్చే ఏడాది జూన్ నెలలో ఈ సినిమా రిలీజ్ కానుందని మేకర్స్ అధికారికంగా అయితే ప్రకటించారు. అయితే ఆ సమయానికి ఈ సినిమా విడుదల కావడం కష్టమేనని సమాచారం.

సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశం అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా గ్రాఫిక్స్ పనులు జూన్ సమయానికి కూడా పూర్తి కావని సమాచారం. క్వాలిటీ గ్రాఫిక్స్ లేకపోతే శాటిలైట్, డిజిటల్ హక్కులు సైతం భారీ మొత్తానికి అమ్ముడయ్యే అవకాశం అయితే ఉండదు. ఈ కారణం వల్లే ఆదిపురుష్ మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆదిపురుష్ జూన్ లో కూడా రిలీజ్ కాదనే వార్త ఫ్యాన్స్ కు అయితే షాకిస్తోంది.

ఆదిపురుష్ సినిమాలో నటించి ప్రభాస్ తప్పు చేశాడని కొంతమంది ఫ్యాన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఆదిపురుష్ షూట్ మొదలైన రోజు నుంచి ఇప్పటివరకు ఈ సినిమాకు పాజిటివ్ గా ఏదీ జరగలేదు. అన్నీ నెగిటివ్ గానే జరుగుతుండటంతో ప్రభాస్ సైతం ఈ సినిమా విషయంలో ఒకింత హర్ట్ అయ్యారని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆదిపురుష్ విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి మరి.

ఆదిపురుష్ మూవీ కంటే సలార్ మూవీనే ముందు విడుదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లు కచ్చితంగా సక్సెస్ సాధిస్తాయని అభిమానులు కూడా భావిస్తున్నారు. ప్రభాస్ సినిమాలన్నీ వేర్వేరుగా 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతుండటం విశేషం.. ప్రభాస్ ఒక్కో ప్రాజెక్ట్ కు భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: