తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటు వంటి నితిన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నితిన్ ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం నితిన్ "మాచర్ల నియోజకవర్గం" అనే మూవీ ద్వారా ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ కథతో రూపొందింది. ఎమ్ ఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేక పోయింది. ఈ మూవీ లో కృతి శెట్టి , నితిన్ సరసన హీరోయిన్ గా నటించింది. ఇలా మాచర్ల నియోజకవర్గం మూవీ తో ప్రేక్షకులను కాస్త నిరుత్సాహపరిచిన నితిన్ తాజాగా తన కొత్త మూవీ ను ప్రారంభించాడు. 

నితిన్ మరియు వక్కంతం వంశీ కాంబినేషన్ లో ఒక మూవీ ని కొన్ని రోజుల క్రితమే అనౌన్స్ చేసిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ నితిన్ కెరియర్ లో 32 వ మూవీ గా రూపొందబోతుంది. తాజాగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ స్పాట్ నుండి విడుదల అయిన ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ మూవీ లో నితిన్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , హారిస్ జయరాజ్ ఈ మూవీ కి సంగీతం అందించనున్నాడు. వక్కంతం వంశీ ఇది వరకు అల్లు అర్జున్ హీరో గా తెరకెక్కిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ కి దర్శకత్వం వహించాడు. దర్శకుడి గా బక్కంత వంశీ కి ఇది రెండవ సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: