నటి శ్రేయ శరణ్‌ ఫుల్‌ జోష్‌లో ఉంది అని చెప్పొచ్చు. సక్సెస్‌ ఆనందంలో యమ హాట్‌గా కనిపిస్తుంది. అందాల విందుతోపాటు తనపై వచ్చిన విమర్శలకు కౌంటరిస్తుంది.

నెట్టింట రచ్చ రచ్చ లేపుతుంది.

శ్రియా శరణ్‌ గ్రీన్‌ డ్రెస్‌లో మెరిసింది. సూపర్‌ హాట్‌ పోజులతో అదరహో అనిపించింది ఈ బ్యూటీ,కిల్లింగ్‌ లుక్స్ తో కుర్రాళ్ల హృదయాలను గుచ్చేస్తుంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతున్నాయి. అభిమానులను ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.

శ్రియా శరణ్‌ ఆనందానికి అవదుల్లేవు. ఆమె కమ్‌ బ్యాక్‌కి అదిరిపోయే బూస్ట్ దొరికిందని చెప్పొచ్చు. బాలీవుడ్‌లో శ్రియా `దృశ్యం2`లో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా గత వారం విడుదలై దూసుకుపోతుంది. ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలుస్తుంది. ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌ సినిమాలు ఆడటం లేదు. ఈ క్రమంలో `దృశ్యం2` పెద్ద ఎనర్జీనిచ్చింది.


సినిమా వారం రోజుల్లో రూ.110 కోట్లు వసూలు చేసింది. రికార్డు కలెక్షన్ల దిశగా దూసుకుపోతుంది. బాలీవుడ్‌కి ఆక్సిజన్‌లా నిలిచింది. ఇందులో అజయ్‌ దేవగన్‌తో కలిసి శ్రియా నటించింది. ఇది సౌత్‌లో వచ్చిన `దృశ్యం2`కి రీమేక్‌ అనే విషయం తెలిసిందే మరీ,అజయ్‌కి జోడీగా శ్రియా అదరగొట్టింది. దీంతో సెకండ్‌ ఇన్నింగ్స్ లో పూర్వవైభవాన్ని పొందిందని చెప్పొచ్చు.

ఇక ఈ సక్సెస్ ఆమెకి మున్ముందు మరిన్ని అవకాశాలు బాగా తీసుకొస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం శ్రియా సీనియర్‌ హీరోలకు బెస్ట్ జోడీగా నిలుస్తుంది. మున్ముందు ఆమెకి సీనియర్‌ హీరోల సినిమాల్లో లీడ్‌ పెయిర్‌గా ఛాన్స్ వస్తుందని చెప్పడంలో సందేహం లేదంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం శ్రియా `మ్యూజిక్‌ స్కూల్‌`, కన్నడలో `కబ్జా` చిత్రాల్లో నటిస్తుంది.

మరోవైపు ట్రోలర్స్ కి మరోసారి కౌంటర్‌ బాగానే ఇచ్చింది నటి శ్రియా. ఇటీవల ఆమె తన భర్త ఆండ్రీకి పబ్లిక్‌లో లిప్‌ కిస్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇది వివాదంగా మార్చారు. దీన్ని ట్రోల్‌ చేశారు. పబ్లిక్‌ లో ఇదే పని అంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఓ సారి కౌంటర్‌ ఇచ్చింది శ్రియా.

తాజాగా మరోసారి ఆమె దిమ్మతిరిగే కౌంటర్‌ కూడా ఇలా ఇచ్చింది. మరోసారి తన భర్తకి లిప్‌ కిస్‌ ఇస్తున్న వీడియోని షేర్‌ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఈ వీడియోని పోస్ట్ చేసింది. ఎయిర్‌ పోర్ట్ లో ఓ సారి, `దృశ్యం 2` ప్రమోషన్‌లో మరోసారి తన భర్తకి లిప్‌ కిస్‌ ఇచ్చిన వీడియోని పంచుకుంటూ అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చింది  నటి శ్రియా శరణ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: