ప్రముఖ యంగ్ దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో అడవి శేష్ హీరోగా నటించిన "హిట్ 2:ది సెకండ్ కేస్" సినిమా డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోని ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈరోజు సాయంత్రం హైదరాబాదులో ఘనంగా నిర్వహించబోతున్నారు. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పక్కన పెడితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా నేషనల్ డైరెక్టర్ పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి హాజరు కాబోతున్నారని తెలిసి.. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై మరింత అంచనాలు నెలకొన్నాయి.

సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ఆధ్యాంతం సెన్సార్ బోర్డు నిర్వహకులను సైతం ఆకట్టుకుంది.  అంతేకాదు తర్వాత ఏం జరుగుతుంది అనే విషయం కూడా ఊహించని రేంజ్ లో ట్విస్ట్ ఇస్తూ భారీ షాక్ తగిలేలా సినిమాను రూపొందించారు. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి.  అంతేకాదు ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా అగ్ర దర్శకుడు రాజమౌళి హాజరు కానుండడంతో మరింత అంచనాలు పెరిగిపోతున్నాయని చెప్పవచ్చు.  ఈ సినిమాని వాల్ పోస్టర్ బ్యానర్ పై ప్రశాంతి తిపిరినేనితో  కలిసి హీరో నాని నిర్మిస్తున్నాడు.ఇప్పటికే హిట్ ఫస్ట్ కేస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళి గెస్ట్ గా వచ్చాడు . ఆ సినిమా పెద్ద హిట్ అయింది మరోసారి ఆ సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తూ సీక్వెల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రాజమౌళిని గెస్ట్ గా ఆహ్వానించినట్లు సమాచారం. ముఖ్యంగా రాజమౌళితో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ ఈవెంట్ కి హాజరు కాబోతున్నారు. ఇందులో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ సినిమాలో అడవి శేష్ కృష్ణదేవ్ అలియాస్ కేడి అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: