ఛలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే తన నటనతో ప్రేక్షకులను మెప్పించి నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి కొన్ని నెలల వ్యవధిలోనే సరిలేరు నీకెవరు సినిమాలో మహేష్ బాబు సరసన నటించి మరింత పాపులారిటీని దక్కించుకున్న ఈమె ఇటీవల అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో డీ గ్లామరస్ పాత్ర పోషించి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకుంది.


ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక పై ఆమె మాతృభూమి కర్ణాటక నుంచి వ్యతిరేకత వెలబడుతూ ఉండడం గమనార్హం. అయితే రష్మిక చేసిన కొన్ని పనుల వల్లే కన్నడిగులు ఈమెపై పూర్తిస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు ఇంటర్వ్యూలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక మాట్లాడుతూ.." మాతృ భాష కన్నడ అయినప్పటికీ కన్నడ స్పష్టంగా మాట్లాడడం ఇంకా రాదు.." అని చెప్పి కన్నడిగులను ఆగ్రహానికి గురి చేసింది. మరొకవైపు దేశం మెచ్చిన కాంతారా సినిమాను "ఇంకా చూడలేదు.. త్వరలో చూస్తాను.."  అంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పి మరొకసారి వారి కోపానికి గురి అయ్యింది ఈ ముద్దుగుమ్మ.

ఇలా వరుసగా కర్ణాటక నుంచి వచ్చి కర్ణాటక ఇండస్ట్రీని తప్పు పట్టే విధంగా మాట్లాడుతుండడం తో.. ఇకపై ఈమె సినిమాలను కర్ణాటకలో ఆడకుండా బ్యాన్ చేస్తామన్నట్లుగా గత కొద్దిరోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.  అంతేకాదు అక్కడ సినీ ప్రేక్షకులు కూడా ఈమెను కర్ణాటకలో బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున గోల చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఈరోజుతో రష్మిక కెరియర్ తేలనుంది. కర్ణాటకలో ఈరోజు థియేటర్ ల యజమానులు,  డిస్ట్రిబ్యూటర్లు,  కన్నడ సంస్థలతో సమావేశమైన తర్వాత అధికారికంగా ప్రకటించబోతున్నారు. మరి వారి నిర్ణయంపై రష్మిక కెరియర్ ఆధారపడనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: