తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా మరియు డిస్ట్రిబ్యూటర్ గా అత్యంత గుర్తింపును పొందిన దిల్ రాజు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దిల్ రాజు తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న వరిసు అనే తమిళ మూవీని తెరకెక్కిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తూ ఉండగా , రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు  ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం పొంగల్ కానుకగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. తెలుగు లో ఈ మూవీ ని వారసుడు పేరుతో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే వచ్చే సంవత్సరం సంక్రాంతి కి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన హీరోలు అయినటువంటి చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య , బాలకృష్ణ హీరోగా తనకెక్కిన వీర సింహా రెడ్డి మూవీ లు కూడా విడుదలకు రెడీగా ఉన్నాయి. అయితే వాటికి పోటీగా దిల్ రాజు "వరిసు" మూవీ ని విడుదల చేస్తున్నాడు అని కొన్ని వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా ఈ వార్తలపై దిల్ రాజు స్పందిస్తూ ... సంక్రాంతి కి వరసుడు మూవీ ని విడుదల చేస్తున్నాము అని చిరంజీవి గారి సినిమా మరియు బాలకృష్ణ సినిమా కంటే ముందుగా మేమే ప్రకటించాము అని చెప్పాడు. చిరంజీవి హీరోగా తెరకెక్కిన వాల్తేరు వీరయ్య మూవీ ని సంక్రాంతి కి విడుదల చేస్తున్నట్లు జూన్ లో చెప్పారు. బాలకృష్ణ గారి వీర సింహా రెడ్డి మూవీ ని సంక్రాంతి కి విడుదల చేస్తున్నట్లు అక్టోబర్ లో చెప్పారు అని , వరసు మూవీ ని సంక్రాంతి కి విడుదల చేస్తున్నట్లు మేము మే లోనే చెప్పాము అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: