మెగా బ్రదర్ నాగబాబు హీరోగా పలు సినిమాలలో నటించినా పెద్దగా గుర్తింపు తెచ్చుకోకపోయేసరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఆ తర్వాత నిర్మాతగా సెటిల్ అయ్యాడు.. నిజానికి స్టార్ హీరోల అండ ఉండి కూడా ఆయన హీరోగా ఎదగలేకపోవడం గమనార్హం. అందుకే నిర్మాతగా మారి తన తల్లి పేరు మీద అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ ఏర్పాటు చేసి చిరంజీవి సినిమాలను నిర్మిస్తూ వచ్చాడు. అలా అన్నయ్య చిరంజీవితో కలిసి నాగబాబు రుద్రవీణ , త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు లాంటి ఎన్నో సినిమాలు నిర్మించగా అవి ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి

అయితే ఈ సినిమాలు తర్వాత బావగారు బాగున్నారా సినిమా మాత్రమే మంచి విజయాన్ని అందించింది. భారీ బడ్జెట్లో వచ్చిన ఏ సినిమా కూడా ఈయనకు లాభాన్ని తెచ్చి పెట్టలేదు.  అందుకే చిరంజీవితో నిర్మించిన సినిమాలు ఎక్కువగా  ఫ్లాప్ అవుతున్నాయని ఆయన కొడుకు రామ్ చరణ్తో కలిసి ఆరెంజ్ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాతో భారీ అప్పుల పాలైన నాగబాబును అప్పుల నుంచి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆదుకున్నట్లు.. నాగబాబు తెలిపిన విషయం తెలిసిందే. ఆరెంజ్ సినిమా తర్వాత పూర్తిగా నష్టపోయిన నాగబాబు జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించాడు.

ముఖ్యంగా అటు చిరంజీవి, ఇటు పవన్ కళ్యాణ్,  రామ్ చరణ్ ఏ ఒక్కరు కూడా నాగబాబుకు లాభాల పంటను తెచ్చి పెట్టలేదు.  అయితే ఆరెంజ్ సినిమా తర్వాత నాగబాబుకి అనుభవాలన్నీ కొన్ని ఏళ్ల తరబడి వెంటాడాయి. ఆ తర్వాత అప్పులన్నీ తీర్చుకొని తన కొడుకు వరుణ్ హీరోగా ఎదగడంతో నాగబాబు ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు.  అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..  గతంలో జరిగిన అనుభవాలను అన్ని మర్చిపోయే నాగబాబు ఆరెంజ్ సినిమాను కాల్ట్  క్లాసిక్ అని అంటున్నాడు.  త్వరలోనే ఈ సినిమా రీ రిలీజ్ చేస్తానని కూడా ప్రకటించాడు. అయితే ఈ సినిమా విడుదలయ్యి 12 ఏళ్లవుతున్న సందర్భంగా అభిమానుల కోరిక మేరకు ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు.  దీంతో అభిమానులు ఫైర్ అవుతున్నారు. అంత నష్టం వచ్చినా  మళ్లీ మీ బుద్ధి మార్చుకోవా అంటూ కామెంట్లు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: