బాలకృష్ణ అభిమానులు కొన్ని సంవత్సరాలుగా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చాల ఆశగా ఎదురు చూస్తున్నారు. సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ బాలయ్య వారసుడు పై క్లారిటీ రావడంలేదు. అసలు మోక్షజ్ఞ కు సంబంధించిన ఫోటోలను కూడ బయటకు రానీయకుండా బాలకృష్ణ ఎందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడో అతడి అభిమానులకు కూడ అర్థం కావడంలేదు.

 

 

 

ఒకటి రెండు సందర్భాలలో బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మాట్లాడుతూ అతడు సినిమాలలోకి రాడు అని చెప్పకుండా ఇంకా సమయం ఉంది అంటూ సమాధానం దాటవేస్తూ ఉండటంతో మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలకృష్ణకు కూడ సరైన క్లారిటీ లేదా అన్న సందేహాలు కొందరికి వస్తున్నాయి. ఈమధ్య గోవాలో జరిగిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కు బోయపాటి రావడం జరిగింది. అక్కడ అతడిని కొన్ని తెలుగు మీడియా వర్గాలు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అడిగినప్పుడు బోయపాటి చాల విభిన్నంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి.

 

 
మోక్షజ్ఞ ఎంట్రీ గురించి నందమూరి ఫ్యామిలీకి ఒక స్పష్టమైన యాక్షన్ ప్లాన్ ఉందని అతడి బాడీ లాంగ్వేజ్ కి ఎలాంటి కథ సెట్ అవుతుంది అన్న విషయం పై కూడ బాలయ్యకు ఒక అవగాహన ఉందని అయితే ఆమూవీ ఎప్పుడు మొదలవుతుందో తాను చెప్పలేనని కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు దేవుడు ఆజ్ఞ లేకుండా ఏది జరగదని అంటూ మోక్షజ్ఞ విషయంలో దైవనిర్ణయం ఎలా ఉందో తాను ఊహించి చెప్పలేను అన్నట్లు తెలుస్తోంది.

 

 

 అంతేకాదు అవకాశం వస్తే తాను మోక్షజ్ఞ ను డైరెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నానని అయితే బాలయ్య మనసులో ఏముందో తనకు తెలియదు అంటూ వ్యూహాత్మకంగా కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ సమఉజ్జీలు అయిన నాగార్జున చిరంజీవిల వారసులు ఇండస్ట్రీలో టాప్ యంగ్ హీరోలుగా చలామణి అవుతుంటే అలాంటి స్థాయిలో మోక్షజ్ఞ ను ఎప్పుడు చూడాలో తెలియక బాలయ్య అభిమానులు దిగాలు పడిపోతున్నారు. దీనితో రానున్న రోజులలో మోక్షజ్ఞ ఎంట్రీ పై ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: