తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్షణం మూవీ తో సోలో హీరో గా మంచి విజయాన్ని అందుకొని , ఆ తర్వాత గూడాచారి , ఎవరు , మేజర్ మూవీ లతో వరస విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న అడవి శేషు తాజాగా హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ని నాని నిర్మించగా మీనాక్షి చౌదరిమూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొన్ని సంవత్సరాల క్రితం విడుదలై మంచి విజయం సాధించిన హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వెల్ గా రూపొందింది. హిట్ ది సెకండ్ కేస్ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

ఏది ఇలా ఉంటే ఈ మూవీ ని డిసెంబర్ 1 వ తేదీనే ఓవర్ సీస్ లో లో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ఓవర్ సీస్ హక్కులను పి హెచ్ ఎఫ్ మరియు క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు దక్కించుకున్నాయి. ఈ మూవీ ని ఈ రెండు సంస్థలు ఓవర్ సీస్ లో భారీగా విడుదల చేయడానికి ఇప్పటికే ఈ రెండు సంస్థలు సన్నాహాలు చేసుకున్నాయి. ఈ మూవీ ని ఓవర్ సీస్ లో ఏకంగా 450 ప్లస్ లొకేషన్ లలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు , పాటలు ప్రేక్షకులను ఎం తగానో ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి హిట్ ది సెకండ్ కేస్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే డిసెంబర్ 2 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: