టాలీవుడ్ లో అల్లు అర్జున్, ఇంకా కోలీవుడ్లో విజయ్ లు స్టార్  హీరోలుగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.పుష్ప సినిమా తరువాత పాన్ ఇండియా స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ కు కూడా ఇప్పుడు అభిమానులు పెరిగారు. అయితే ముఖ్యంగా ఫస్ట్ నుంచి కూడా అల్లు అర్జున్  డాన్స్  పెర్ఫార్మెన్స్ కు సెపరేట్ ఫ్యాన్  బేస్  ఉంది.అందువల్లే ఆయనకి చాలా మంది అభిమానులుగా మారిపోయారు.ఇక విజయ్ కూడా మంచి డాన్సర్. యూట్యూబ్ లో విజయ్ పాట వస్తే ఖచ్చితంగా అది వైరల్  అవుతుంది. ఆ రేంజిలో విజయ్ కి క్రేజ్  ఉంది.ఇలా అల్లు అర్జున్ ఇంకా విజయ్ తమ సినిమాలలో అద్భుతమైన మాస్ స్టెప్పులతో డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తుంటారు. అయితే ఇక రేసుగుర్రం సినిమాలో అల్లు అర్జున్  కి అన్నయ్యగా నటించిన శ్యామ్ ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ డాన్స్ గురించి చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్  మీడియాలో  తెగ వైరల్ అవుతున్నాయి.


తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఇతనికి అల్లు అర్జున్ విజయ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రశ్న ఎదురయింది. వీరిలో ఎవరు బెస్ట్ డాన్సర్ అంటూ ప్రశ్నించగా ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ తన దృష్టిలో అల్లు అర్జున్ కన్నా విజయ్ బెస్ట్ డాన్సర్ అంటూ ఆయన సమాధానం చెప్పారు.ఇక ఈ విషయాన్ని అల్లు అర్జున్ కూడా స్వయంగా ఒప్పుకుంటాడని శ్యామ్  తెలిపారు. విజయ్ డాన్స్ చేస్తే చాలా నేచురల్ గా ఇంకా చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ అల్లు అర్జున్ ఒక పాటకు డాన్స్ చేయాలంటే చాలా పెద్ద ఎత్తున రిహార్సల్స్ చేస్తారంటూ ఆయన వెల్లడించారు.తాను రేసుగుర్రం సినిమాలో నటించే సమయంలో బన్నీ ఆ సినిమాలో పాటలకు పదే పదే స్టెప్పులను ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారని ఈ సందర్భంగా శ్యామ్ బన్నీ డాన్స్ గురించి చేసినటువంటి ఈ కామెంట్లు వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం ఈ కామెంట్స్  వైరల్ ఇప్పటికీ కూడా బన్నీ విజయ్  ఫ్యాన్స్  మధ్య యుద్ధం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: