సినిమా ఇండస్ట్రీలో హీరో అయినా, హీరోయిన్ అయినా ఒక స్థాయి వరకు వచ్చే వరకు కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తేనే కెరీర్ లో సక్సెస్ ను అందుకోవచ్చు. అలా కాకుండా ఒక సినిమా అవకాశం వచ్చింది కదా అని కథ విషయంలో నిర్లక్ష్యం చేస్తే కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు. ప్రస్తుతం నార్త్ కు చెందిన ఒక భామ ఇదే కష్టాన్ని ఎదుర్కొంటోంది. ముంబై భామ అనన్య పాండే గురించి కుర్రకారును ఎవరు కదిపినా కథలు కథలుగా ఆమె అందాల గురించి చెబుతారు. ఈమెకు పెద్ద సంస్థ, నిర్మాత, హీరో మరియు డైరెక్టర్ తో సినిమా చేసే అవకాశం దక్కింది.

అదే లైగర్... ఇందులో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ , డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మరియు బాలీవుడ్ లోనే ప్రముఖ నిర్మాత అయిన కరణ్ జోహార్ ల కలయికలో హీరోయిన్ గా చేసే సువర్ణావకాశాన్ని పొందినది. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన నాటి నుండి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మొత్తానికి సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది. కానీ మొదటి షో నుండి నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుని అందరి జీవితాలను తలక్రిందులు చేసింది. పూరీజగన్నాధ్ మరియు ఛార్మీలు కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్నారు. మొత్తానికి ఈ సినిమా భారీ నష్టాలను మరియు చేదు జ్ఞాపకాలను మిగిల్చింది.

ఇంకా ఈ సినిమా వలన నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ పూరి జగన్నాధ్ ను డబ్బు కోసం వెంటాడుతూనే ఉన్నారు. ఈ సినిమా ప్లాప్ కావడంతో అనన్య పాండే కెరీర్ ప్రశ్నర్ధకంగా మారింది. సినిమా డిజాస్టర్ కావడానికి హీరోయిన్ కూడా ప్రధాన కారణం అని టాక్ రావడంతో అనన్యకు షాక్ తగిలింది. తనకు అందం తప్ప నటనలో ఏమాత్రం ప్రావీణ్యం లేదని సోషల్  మీడియా వేదికగా ట్రోల్స్ దర్శనమిచ్చాయి. ఇపుడు తన చేతిలో "డ్రీం గర్ల్ 2" అనే సినిమా ఒక్కటే ఉండడం గమనార్హం. ఈ సినిమా హిట్ అయితేనే తన కెరీర్ ఉంటుంది, లేదంటే ఇక తన కెరీర్ ముగిసినట్లే అంటూ సినిమా వర్గాలు భావిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: