తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటుడు జూనియర్ ఎన్టీఆర్ . తన సహజమైన నటనతో అందరిని కూడా ఆకట్టుకుంటున్నారు. స్టూడెంట్ నెంబర్ వన్ తో మొదటి విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ఇక వెను తిరిగి చూసుకోలేదు.

తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. సింహాద్రి, రాఖీ, జనతా గ్యారేజ్, నాన్నకు ప్రేమతో, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాల్లో తనలోని నటనకు బాగా పదునుపెట్టుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆయన నటనను చూసిన ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కొమరం భీంగా ఎన్టీఆర్ నటన అందరిని కూడా ఆకట్టుకుంది. అలా నటించడం వారి రక్తంలో ఉందనే ప్రశంసలు కూడా వస్తున్నాయి.


సినిమా సినిమాకు ఆయన వైవిధ్యం చూపిస్తున్నారు. తన చిన్నాన్న బాలకృష్ణ, నాన్న హరికృష్ణలోని నటన కౌశలాన్ని పుణికిపుచ్చుకున్న ఎన్టీఆర్ సహజమైన రీతిలో నటిస్తూ ఎంతో మందిని అయితే కట్టిపడేస్తున్నారు. డైలాగ్ డెలివరీలో ఇప్పటివరకు ఆయనను మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఎంత పెద్ద డైలాగయినా ఇట్టే చెప్పేయడం ఆయనకు అలంకార భాష్యమే. సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకతను సాధించుకున్న ఎన్టీఆర్ సినిమాలంటే చాలా మందికి కూడా ఇష్టమే. ఆయన సినిమాల్లో నటిస్తున్నట్లుగా ఉండదు జీవిస్తున్నట్లుగా పాత్రలో లీనం కావడం విశేషం..

ఆర్ఆర్ఆర్ సినిమా హాలీవుడ్ ప్రమోషన్లలో భాగంగా రాజమౌళి ఎన్టీఆర్ గురించి ఆసక్తికర కామెంట్లు అయితే చేశారు. ఎన్టీఆర్ సహజమైన నటుడు అని కితాబిచ్చారు. అలాంటి నటుడిని డైరెక్టు చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెబుతున్నారు. ఎన్టీఆర్ నటన ఓ పవర్ హౌస్ లాంటిదని ప్రశంసలు అయితే కురిపించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆయన నటన చూసి ఆశ్చర్యపోయానన్నారు. ఎన్టీఆర్ కు నటన పుట్టుకతోనే వచ్చిందని పేర్కొనడం విశేషం.. ఆయన గ్రాస్పింగ్ పవర్, నటనను చూస్తుంటే తెగ ముచ్చటేస్తుంది.


ఎన్టీఆర్ నటనను మెచ్చుకోని వారుండరంటే అతిశయోక్తి అయితే లేదు.. వైవిధ్యమైన భావజాలంలో సునాయాసంగా నటించడం ఆయన కు మాత్రమే సొంతం. ఈ నేపథ్యంలో తెలుగు సినిమాకు దొరికిన మరో ఆణిముత్యమని చెబుతున్నారు. తాతలోని హావభావాలు కూడా ఎన్టీఆర్ కు బాగా అబ్బాయి. దీంతో తమ నటవారసుల వారసత్వాన్ని ఎన్టీఆర్ కొనసాగిస్తున్నారు. ఎంతటి డైలాగునైనా సునాయసంగా చెప్పగల సామర్థ్యం ఎన్టీఆర్ కు బాగా ఉంది. అందుకే ఆయనకు అభిమానులు కూడా ఎక్కువే. దర్శకుడు రాజమౌళి ఎన్టీఆర్ ను ఓ పవర్ హౌస్ గా పొగడటం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: