టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న యంగ్ హీరోలలో ఒకరు అయినటువంటి రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని తాజాగా ది వారియర్ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి లింగుసామి దర్శకత్వం వహించగా , కృతి శెట్టి ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించగా ,  ఆది పినిశెట్టి ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే తెలుగు మరియు తమిళ భాషలలో ఒకే సారి విడుదల చేశారు. భారీ అంతరాల నడుమ విడుదల అయిన ఈ మూవీ తెలుగు మరియు తమిళ ప్రేక్షకులను బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం అలరించలేకపోయింది. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా హిందీ వర్షన్ ను యూట్యూబ్ లో విడుదల చేశారు. యూట్యూబ్ లో మాత్రం ది వారియర్ మూవీ  హిందీ వర్షన్ కి  ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ హిందీ వర్షన్ యూట్యూబ్ లో విడుదల అయిన కేవలం 8 రోజుల్లోనే 50 మిలియన్ లకు పైగా వ్యూస్ ను మరియు 1 మిలియన్ లుక్ లను సాధించింది. ఇది ఇలా ఉంటే రామ్ పోతినేని కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ఈస్మార్ట్ శంకర్ మూవీ కూడా హిందీ వర్షన్ లో అద్భుతమైన వ్యూస్ ను సాధించింది. ఈస్మార్ట్ శంకర్ మూవీ హిందీ వర్షన్ ఇప్పటికే 300 మిలియన్ లకు పైగా వ్యూస్ ను సాధించింది. ఇలా ఇప్పటికే ఈస్మార్ట్ శంకర్ మూవీ తో హిందీ ప్రేక్షకుల మనసు దోచుకున్న రామ్ పొతినేని తాజాగా ది వారియర్ మూవీ తో కూడా హిందీ ప్రాయక్షకులను బాగానే అలరిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: