తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య రిమెక్ సినిమాల సంఖ్య పెరిగింది.. స్టార్ హీరోలు కూడా ఈ సినిమాలను చేస్తూ బిజిగా ఉన్నారు. అయితే, ఇటీవల మెగాస్టార్ చిరంజీవి రిమెక్ సినిమాలో నటించి భారీ విజయాన్ని అందుకున్నాడు.. ఇటీవల 'ఆర్ఆర్ఆర్' చిత్రం తో పాన్ ఇండియా స్థాయిలో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. ఈ సినిమాలో రామరాజు పాత్ర లో చరణ్ పర్ఫార్మెన్స్ విమర్శకుల ప్రశంసలను అందుకుంది.


సినిమా తరువాత తన నెక్ట్స్ చిత్రాన్ని తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా, తాజాగా తన నెక్ట్స్ ప్రాజెక్టును 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సానాతో తెరకెక్కించేందుకు రెడీ అయినట్లు చరణ్ అఫీషియల్‌గా ప్రకటించాడు. అయితే తాజాగా ఓ ఇంటర్యూలో చరణ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రీమేక్ సినిమాల పై తనదైన శైలి లో కామెంట్ చేశాడు ఈ స్టార్ హీరో. తాను రీమేక్ సినిమాలకు వ్యతిరేకం కాదని.. అయితే ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రాని రీమేక్ కథలనే తాను చేస్తానని, అలాగే దర్శకనిర్మాతలు పలానా రీమేక్ చిత్రం తనతో వర్కవుట్ అవుతుందని భావిస్తేనే, తాను ఆ రీమేక్ సినిమాకు ఓకే చెబుతానని చరణ్ క్లారిటీ ఇచ్చాడు.


గతంలో తాను చేసిన 'ధృవ' రీమేక్ చిత్రం అయినా, తెలుగు ఆడియెన్స్‌కు అది బాగా కనెక్ట్ అయ్యిందని చరణ్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. రీమేక్ సినిమాలు థియేటర్ల లో రిలీజ్ కాకముందే, వాటి ఒరిజినల్ సినిమాలు ఓటీటీ లో ప్రత్యక్షమవడంతో ప్రేక్షకులు ఓటీటీలోనే ఆ సినిమాల ను చూస్తున్నారని, అందుకే ఓటీటీలో రిలీజ్ కాని రీమేక్ సినిమా అయితేనే తాను చేస్తానని దర్శక నిర్మాతలకు చరణ్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. ఇక చెర్రి ఫ్యుచర్ లో అయిన మంచి ప్రాజెక్ట్ లను చేస్తాడేమో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: