దిల్ రాజుగారు తలుచుకుంటే దేనికి కొదవా అన్న సామెత తీరుగా ఒక డబ్బింగ్ సినిమా వారసుడుకి ఎక్కువ థియేటర్లు వచ్చేలా చేయడం పట్ల దిల్ రాజు మీద వస్తున్న కామెంట్లకు పబ్లిక్ స్టేజి మీద కాదు కానీ ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానం చెప్పిన తీరు మీద కొత్త చర్చ మొదలయ్యింది అని చెప్పొచ్చు.

సదరు ఏబిఎన్ రాధాకృష్ణకు ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ, వ్యాపార లావాదేవీలు, అనువాదాల దందాల మీద అంతగా అవగాహన లేకపోవడంతో సమాధానాలు కరెక్టే ఎటొచ్చి ప్రశ్నలే రాంగ్ అన్న తరహాలో జరిగిపోయింది. నితిన్ దిల్ లో వేణుమాధవ్ ఎపిసోడ్ ని తలపించారు. కొన్ని అంశాల మీద  ఒక క్లారిటీ వచ్చినప్పటికీ ఇంకొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి

దిల్ రాజు ప్రస్తావించిన విషయాల్లో ముఖ్యమైనవి చూస్తే వీరసింహారెడ్డిని ముందు డిసెంబర్ కు అనుకుని తర్వాత సంక్రాంతికి మార్చారని కాబట్టి వాళ్ళదే సెల్ఫ్ గోలనే అనే తరహాలో చెప్పారు. కానీ ఎంత వేగంగా చిత్రీకరణ జరుపుతున్నా ఇంకా షూటింగ్ అవ్వలేదన్న సంగతి ఫ్యాన్ కే కాదు అందరికీ  బాగా తెలుసు. 75 ఏళ్ళ టాలీవుడ్ చరిత్రలో ఒకే బ్యానర్ రెండు పెద్ద సినిమాలు ఇలా రిలీజ్ ఎప్పుడు చేయలేదన్నారు. నిజమే కావొచ్చు. పరిస్థితులు అనుకూలించక బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే బంగారు బుల్లోడు, నిప్పురవ్వలను ఒకే డేట్ కి విడుదల చేయడం ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. నాని జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యంలు సైతం క్లాష్ కాక తప్పదు.

ఇదంతా ఎవరూ కావాలని చేసింది కాదు. 2019లో పేటను ఉన్నట్టుండి పొంగల్ రేసులో దింపితే అది తప్పన్నాను కానీ వేరే ఉద్దేశం లేదని సెలవిచ్చారు. తెలుగు హక్కులు కొన్నవాళ్ళ వ్యవహారం ఆలస్యమయ్యుండొచ్చు కానీ నిజానికి పేటకి ఒరిజినల్ వెర్షన్ కి ఆ డేట్ ముందు ఫిక్స్ చేసిందే. ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో సంధ్య తప్ప మిగిలినవన్నీ ఓనర్లే నడుపుతున్నారని  ఇలా చెప్పారు. మరి అందరు హీరోల అభిమానులు సెంటిమెంట్ గా భావించే కీలకమైన సుదర్శన్ 35 ఎంఎంలో దిల్ రాజు నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించినవే అత్యధికంగా రిలీజ్ కావడం సాక్ష్యాలతో సహా ఉంది అని, వారసుడు సైతం దీంట్లోనే వస్తోందన్న వార్త చిరంజీవి బాలకృష్ణ అభిమానులకు ఆగ్రహం కలిగించింది. దీన్ని సోషల్ మీడియాలో గమనించవచ్చు.

మైత్రి అధినేతలు తాను రెగ్యులర్ గా కలుసుకుంటామని తమ మధ్య ఎలాంటి బ్యాడ్ ఇష్యూస్  ఏమి లేవని, వాళ్ళకు లేని బాధ ఇంకెవరికో ఎందుకని కౌంటర్ ఇచ్చారు. ఒక్క తమిళం నుంచే పెట్టుబడితో సహా రెట్టింపు లాభాలు వరిసుకు వస్తున్నప్పుడు వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డిలకు ఎందుకు సహకరించడం లేదన్న ప్రశ్న అడిగి ఉంటే ఏ సమాధానం దొరికేదో కానీ అసలీ కోణంలో చర్చే జరగలేదు మరీ. నలుగురు పేర్లు పోయి తానే బ్రాండ్ అయ్యాను కాబట్టి అందరి టార్గెట్ దిల్ రాజు వైపే ఉంటోందని చెప్పారు. మొత్తానికి నా తప్పేం లేదు సరిగానే ఉన్నాను, డబ్బింగ్ అయినా సరే ముందు సంక్రాంతి అని చెప్పింది నేను కాబట్టి వారసుడికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందే అన్న ఇన్ డైరెక్ట్ మీనింగ్ స్పష్టంగా వినిపించింది. మరి దీనికి కౌంటర్ ఎన్ కౌంటర్లు ఏమొస్తాయో వేచి చూడాలి మనం.

మరింత సమాచారం తెలుసుకోండి: