ఆడివి శేష్ హీరోగా శైలేష్ కొలను దర్వకత్వంలో రూపొందిన చిత్రం 'హిట్ 2'.నేచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రశాంతి త్రిపిర్‌నేని ఈ చిత్రాన్ని నిర్మించారు.

డిసెంబర్ 2న  ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది మరీ, మీనాక్షి చౌదరి హీరోయిన్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా శైలేష్ కొలను మాట్లాడుతూ హిట్ 2 జర్నీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను  దర్శకుడు తెలియజేశారు.

''ఎక్కడో కూర్చుని ఓ యూనివర్స్‌ని క్రియేట్ చేయాలని ఆలోచించాను. ఇప్పుడది హిట్ 2తో నిజమైనందుకు చాలా ఆనందంగా ఉంది''అని అన్నారు డైరెక్టర్ శైలేష్ కొలను . ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్ మూవీ 'హిట్ 2'.ఈ సినిమా డిసెంబర్ 2న తెలుగులో రిలీజ్ అవుతుంది. స్టార్ హీరో అడివి శే హీరో.

నాని సమ్పరణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేని సినిమాను నిర్మించారు. శైలేష్ కొలను మాట్లాడుతూ ''హిట్ ఫస్ట్ కేస్ ఈవెంట్‌కి గెస్ట్‌గా వచ్చిన రాజమౌళిగారు అది పెద్ద హిట్ అయ్యి.. సెకండ్ కేస్ చేయాలని అన్నారు. ఆయన అన్నమాట ఈరోజు నిజమైంది.

ఆయన హాలీవుడ్ మూవీలు చేస్తున్నా సరే.. మా హిట్ ఫ్రాంచైజీలకు గెస్ట్‌గా రావాలని కోరుకుంటున్నాను. ఎక్కడో కూర్చుని ఓ యూనివర్స్‌ని క్రియేట్ చేయాలని ఆలోచించాను. ఇప్పుడది నిజమైనందుకు చాలా ఆనందంగా ఉంది.

విక్రమ్ రుద్రరాజుగా నటించిన విశ్వక్ ఎక్కడికి వెళ్లడు. ఎప్పుడు, ఎలా వస్తాడనేది తర్వాత చెబుతాను. హిట్ 2 గురించి చెప్పాలంటే.. చాలా ఎమోషనల్ లేయర్స్‌ను పెట్టి రాసిన సినిమా ఇది.

స్క్రిప్ట్‌ను పెంచడానికి కారణం యూనివర్స్‌ను పెంచాలనే ఆలోచనే. హిట్ 1 కంటే హిట్ 2 పెద్దగా, బెటర్‌గా ఉంటుంది. థియేటర్ ఎక్స్‌పీరియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని సౌండ్ డిజైన్‌, విజువల్స్ అన్నింటిని ప్లాన్ చేసి చేసిన సినిమా ఇది. శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి మంచి సంగీతాన్ని కూడా అందించారు ఈ సినిమా కి.

కె.కెగారు చక్కటి సాహిత్యాన్ని ఇచ్చారు. సినిమాకు జాన్ స్టెబార్ట్ ఎడురి నేపథ్య సంగీతం అందించారు. అది సినిమాకు. ఇక ట్రైలర్‌కైతే శ్రీచరణ్ పాకాల ట్యూన్ ఇచ్చారు.

రియల్ లొకేషన్స్‌లో చిత్రీకరించాం. గ్యారీ ఎడిటింగ్ సూపర్‌. త్వరలోనే స్పై సినిమాతో డైరెక్టర్ అవుతున్న సంగతి  మనకి తెలిసిందే. మణికందన్ సినిమాటోగ్రఫీతో నేను అనుకున్న దాన్నెలా ప్రెజెంట్ చేయాలనేది ఆయనకు బాగా తెలుసు.

మా నిర్మాతలకు థాంక్స్‌. ఆర్టిస్టుల నుంచి చాలా నేర్చుకున్నాను. మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్‌. అడివి శేష్ ఎలా రిసీవ్ చేసుకుంటావోనని భయపడుతూ వచ్చాను.

తనొక పెద్ద క్వశ్చన్ బ్యాంక్. అని చెప్పారు, తనవల్లే నేర్చుకోవాల్సిన దాని కంటే ఎక్కువ నేర్చుకున్నాను. ప్రశాంతిగారు, నానిగారి వల్లే ఇక్కడ నిలబడి ఉన్నాను. నాని బ్రో..

నా ఆలోచనలు ముందు  నతురాల్ స్టార్ నాని గారుకి నచ్చుతాయా అని ఆలోచిస్తున్నాను. నా దర్శకత్వంలో నాని హీరోగా ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాను. నాపై నమ్మకంతో నన్ను దర్శకుడిని చేశారు. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని భవిష్యత్తులోనూ నిలబెట్టుకుంటాను''  ఇలా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: