లేడీ సౌత్ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈమె కథల ఎంపిక విషయంలో ఎంత అద్భుతంగా ఆలోచిస్తుందంటే.. ఆమె చిత్రాల ద్వారా ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అంతలా తన కథల ఎంపిక విషయంలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఒకవైపు రొమాంటిక్ చిత్రాలైనా..మరొకవైపు యాక్షన్ చిత్రాలైనా.. ఇంకొక వైపు కామెడీ చిత్రాలైనా.. హారర్ చిత్రాలతో కూడా భయపెట్టడానికి సిద్ధంగా ఉండే ఈ ముద్దుగుమ్మ కథల ఎంపిక విషయంలో పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. తమ సొంత నిర్మాణ బ్యానర్ రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై కూడా అద్భుతమైన కథలను తెరకెక్కిస్తూ ఉంటారు.అయితే ఈసారి మాత్రం బ్రేకు లేకుండా హారర్ ఎంటర్టైన్మెంట్ చిత్రంతో భయపెట్టడానికి సిద్ధమయ్యింది నయనతార. నయనతార కనెక్ట్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను డైరెక్టర్ అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ట్విట్టర్ వేదికగా నయనతార భర్త , నిర్మాత విగ్నేష్ పంచుకున్నారు. అంతేకాదు మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. "హారర్ కాన్సెప్ట్ గా తెరకెక్కిన కనెక్ట్ సినిమా డిసెంబర్ 22న థియేటర్లలో విడుదల చేస్తున్నామని.. 99 నిమిషాల నిడివి గల ఈ చిత్రం ఇంటర్వెల్ లేకుండా ప్రదర్శించబడుతుందని స్పష్టం చేశారు".


 U/A సర్టిఫై పొందిన ఈ హారర్ మూవీలో లేడీ సూపర్ స్టార్ నటన కొత్తగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నయనతార పుట్టినరోజు నవంబర్ 18వ తేదీన కనెక్ట్ సినిమాకు సంబంధించిన టీజర్ ను  విడుదల చేయగా.. ఈ సినిమా ఆడియన్స్ కు మంచి హారర్ మూవీ ఎక్స్పీరియన్స్ గ్యారెంటీ ఇస్తుందని తెలుస్తోంది.  రౌడీ పిక్చర్స్ బ్యానర్స్ పై నిర్మించిన ఈ సినిమాలో సత్యరాజు, అనుపమ ఖేర్,  వినయ్ నఫీస్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ అనుపమ ఖేర్ ఇటీవల తెలుగులో కార్తికేయ 2 సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వగా.. ఇప్పుడు కనెక్ట్ సినిమాతో కోలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్నారు. పక్క బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: