తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగులో కూడా సమాన స్థాయిలో అభిమానులు ఉన్నారంటే కారణం.. ఆయన నటన, వ్యక్తిత్వం, మంచి లక్షణాలు అని చెప్పవచ్చు. నిరంతరం ప్రయోగాలకు కేరాఫ్ అడ్రెస్స్ గా మారిన సూర్య, కొత్త కొత్త కథలను ఎంచుకుని ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు. సినిమా చూసే ఏ ప్రేక్షకుడు తనను చూసి కాదు, తన పాత్రను చూసి థియేటర్ కు రావాలని అని అనుకునే అతి కొద్ది మంది నటులలో సూర్య ఒకరు. కరోనా టైం లో సూర్య ప్రధాన పాత్ర పోషించిన చిత్రం "జైభీమ్". ఈ సినిమాను ఎంతో సహజంగా తెరకెక్కించి ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు డైరెక్టర్ జ్ఞానవేల్. ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయంలో థియేటర్ లకు అనుమతి లేకపోవడంతో ఓటిటి లోనే విడుదల చేశారు.

అలా ఓటిటిలో రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించిన సినిమాగా జైభీమ్ నిలిచింది. ప్రముఖ న్యాయవాది కె చంద్రు నిజ జీవిత కథను తీసుకుని ఒక మంచి సినిమాగా ఆవిష్కరించారు. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో పలు బహుమతులు దక్కిన విషయం తెలిసిందే. ఇంతలా హిట్ అయిన సినిమాను సీక్వెల్ గా తీస్తే బాగుంటుందని నెటిజన్లు ఎప్పటినుండో తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. తాజగా నిర్మాత రాజశేఖర్ పాండ్యన్ జైభీమ్ కు సీక్వెల్ ను నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి భాగంగా చూపించిన చంద్రు జీవితంలోని మరికొన్ని విషయాలను ప్రేక్షకుల ముందుకు ఈ సీక్వెల్ ద్వారా తీసుకురానున్నట్లు సమాచారం.

జైభీమ్ లో హీరోగా సూర్య ఓ లాయర్ గా నటించి పాత్రను రక్తికట్టించాడు. ఇక సీక్వెల్ లో హీరోగా సూర్యనే కొనసాగిస్తారా లేదా కథలో ఫ్రెష్ నెస్ మరియు ప్రేక్షకులకు కూడా కొత్తదనం ఉండడానికి కొత్త హీరోను తీస్కులేనే అవకాశాలను కూడా కొట్టిపారేయలేము. మరి ఈ సినిమాపైన అప్డేట్స్ తెలియాలంటే మరి కొంతకాలం వెయిట్ చేయాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: