మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ మూవీ కి చిత్ర బృందం టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో 15 వ మూవీ గా రూపొందుతున్న నేపథ్యంలో , ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే రామ్ చరణ్ తన తదుపరి మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేశాడు. రామ్ చరణ్ తన తదుపరి మూవీ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి టాలెంట్ ఉన్న దర్శకుడి గా పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు సన దర్శకత్వంలో చేయబోతున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో 16 వ మూవీ గా రూపొందబోతుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబు సన ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించినట్లు ,  అందులో భాగంగా రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించే ముద్దు గుమ్మ కోసం ఈ దర్శకుడు వెతుకులాటను ప్రారంభించినట్లు ,  అందులో భాగంగా బుచ్చిబాబు బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ను రామ్ చరణ్ 16 వ మూవీ లో హీరోయిన్ గా తీసుకోవాలి అని డిసైడ్ అయినట్లు ,  అందుకోసం బుచ్చిబాబు , జాన్వి కపూర్ ను కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ ,  బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ రూరల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిపోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: