టాలీవుడ్ ఇండ స్ట్రీలో ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరియర్ ను కంటిన్యూ చేస్తున్న అడవి శేషు గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అడవి శేషు తాజాగా హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరోగా నటించాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కి శైలేష్ కొలను దర్శకత్వం వహించగా ,  నాచురల్ స్టార్ నానిమూవీ ని నిర్మించాడు. ఈ మూవీ ని రేపు అనగా డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు నుండి ఈ మూవీ కి ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ మూవీ 2 గంటల మామూలు నిడివి తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ వరస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ ని ఈ చిత్ర బృందం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేస్తుంది. ఈ మూవీ ప్రపం చవ్యాప్తంగా ఎన్ని థియేటర్ లలో విడుదల కాబోతుందో తెలుసుకుందాం.
నైజాం ఏరియాలో 210 ప్లస్ థియేటర్ లలో విడుదల కానుంది. సీడెడ్ లో 90 థియేటర్ లలో విడుదల కానుంది. ఆంధ్రా లో 245 ప్లస్ థియేటర్ లలో విడుదల కానుంది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 550 థియేటర్ లలో ఈ మూవీ విడుదల కానుంది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో  85 థియేటర్ లలో ,  ఓవర్ సీస్ లో 320 థియేటర్ లలో ఈ మూవీ విడుదల కానుంది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 955 థియేటర్ లలో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: