శైలేష్ కొలను దర్శకత్వంలో తాజాగా హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో టాలెంటెడ్ నటుడు అడవి శేషు హీరో గా నటించగా , మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. నాచురల్ స్టార్ నానిమూవీ ని నిర్మించాడు. ఈ మూవీ ని రేపు అనగా డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి ఈ సినిమా యూనిట్ కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఒక ట్రైలర్ ను విడుదల చేసింది. ఆ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ ట్రైలర్ లో అడవి శేషు ఒక కిల్లర్ గురించి వెతుకుతూ ఉంటాడు. 

అయితే తాజాగా ఈ మూవీ యూనిట్ హిట్ ది సెకండ్ కేస్ మూవీ లో కిల్లర్ ఎవరు అనే విషయాన్ని ఈ రోజు సాయంత్రం 6 గంటల 03 నిమిషాలకు తెలియజేస్తాము అంటూ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  ఇది ఇలా ఉంటే ఇప్పటికే హిట్ ది ఫస్ట్ కేస్ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో తెలుగు సినీ ప్రేమికులు హిట్ ది సెకండ్ కేస్ మూవీ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ ఏ రేంజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో ఏ రేంజ్ కలెక్షన్ లను సాధిస్తుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: