సంక్రాంతికి రాబోతున్న సినిమాల జాబితాలు ఇటీవల కాలంలో ప్రేక్షకులను చాలా ఉత్కంఠ భరితంగా ఉండేలా చేస్తున్నాయి. ముఖ్యంగా చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో సంక్రాంతికి విడుదల కాబోతున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు దిల్ రాజు నిర్మిస్తున్న విజయ్ వారసుడు చిత్రం కూడా సంక్రాంతికి విడుదల కాబోతున్నది. ఈ మూడు సినిమాల్లో ఎక్కువగా తెలుగు ప్రేక్షకులు వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల పైన బాగా ఫోకస్ పెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు నిర్మించినది కూడా మైత్రి మూవీస్ వారే కావడం గమనార్హం.


భారీ బడ్జెట్ తో ఎంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాలను నిర్మించారు ఓకే నిర్మాణ సంస్థ నుండి సంక్రాంతికి ఈ రెండు సినిమాలు విడుదల కావడం అనేది చాలా అరుదుగా జరుగుతోందని చెప్పవచ్చు. మొదట వీరసింహారెడ్డి సినిమాని డిసెంబర్ లో విడుదల చేయాలని భావించిన షూటింగ్ పూర్తి కాలేకపోవడంతో సంక్రాంతికి విడుదల చేయవలసి వస్తుందని సమాచారం. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాల మధ్య movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు చాలా నలిగిపోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు నిర్మాతలే కాకుండా హీరోయిన్ శృతిహాసన్ కూడా సంక్రాంతి సినిమాల మధ్య నలిగిపోయే అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తున్నది.


వీర సింహారెడ్డి సినిమాతో పాటు వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా హీరోయిన్గా శృతిహాసన్ నటించినది. సినిమా విడుదల సమయంలో ప్రమోషన్ కార్యక్రమాలకు సోషల్ మీడియాలో హడావిడి కచ్చితంగా శృతిహాసన్ ను చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె అభిమానుల సైతం భావిస్తూ ఉన్నారు. అటు ఇండస్ట్రీ వర్గాలలో కూడా ఇవే వార్తలు ఎక్కువగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. భారీ అంచనాల మధ్య ఈ రెండు సినిమాలు సంక్రాంతికి విడుదల కాబోతున్న నేపథ్యంలో హీరోయిన్గా శృతిహాసన్ ఇదో ఒక అరుదైన రికార్డు అని చెప్పవచ్చు. మరి శృతిహాసన్ మైత్రి మూవీ ని ఎలా తప్పించేలా చేస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: