తెలుగు సినీ చరిత్రలో ఒకప్పుడు ఫ్యామిలి ఎంటర్టైన్మెంట్ సినిమాలను చేస్తూ వస్తున్నారు..అవి చూడటానికి బాగా ఉండటం మాత్రమే కాదు..మంచి కథ కూడా ఉండటంతో ఇంటిల్లి పాధి చూసే వారు.ఆ తర్వాత కొందరు హీరోలు మాత్రమే మాస్ సినిమాలు చేస్తూ వస్తున్నారు.కానీ ఇప్పుడు మాత్రం అందరూ అదే ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మాస్ లుక్ సినిమాలు ట్రెండ్ అవుతున్నాయి. తాను అనుకున్నది సాధించే గట్స్ ఉన్నవాడైతే చాలంటున్నారు మేకర్స్‌. రీసెంట్‌ టైమ్స్‌ టాప్ మూవీస్ అన్నింటిలో హీరోలు నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనే కనిపిస్తున్నారు. హీరోయిజం డెఫినియేషన్ మార్చిన ఘనత పూరి జగన్నాథ్‌దే.


కమర్షియల్ హీరో అంటే పొకిరి, దేశముదురు, ఇడియట్‌ లా కూడా ఉండొచ్చని.. అలాంటి రోల్స్‌లోనూ హీరోలను ఆడియన్స్‌ యాక్సెప్ట్ చేస్తారని ప్రూవ్ చేశారు పూరి. ఈ ట్రెండ్ మరింతగా మారిపోయింది. కేజీఎఫ్ లాంటి సక్సెస్‌ల తరువాత హీరో క్యారెక్టర్‌ను మరింత రూడ్‌గా చూపిస్తున్నారు మేకర్స్‌. ఆడియన్స్‌ కూడా అలాంటి సినిమాలనే ఆదరిస్తున్నారు.పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప లో అల్లు అర్జున్‌ స్మగ్లర్‌గా కనిపించారు. అండర్ వరల్డ్‌లో ఎదగటానికి ఏదైనా చేసే వ్యక్తిగా బన్నీ తెర మీద కనిపించిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

ఇన్నాళ్లు అల్లు అర్జున్‌ను స్టైలిష్‌ స్టార్‌గా చూసిన ఫ్యాన్స్.. పుష్ప సక్సెస్ తరువాత మాస్ హీరోయిజానికి ఐకాన్‌గా ఫీలవుతున్నారు. బాహుబలి లాంటి బిగ్ హిట్ తరువాత ప్రభాస్‌ కూడా నెగెటివ్‌ హీరోగా మారారు. సాహో లో ఇంటర్నేషనల్‌ మాఫియా డాన్‌గా కనిపించారు డార్లింగ్‌. ఈ సౌత్‌ ఆడియన్స్‌కు పెద్దగా కనెక్ట్ కాకపోయినా… నార్త్‌లో మాత్రం గట్టిగానే పెర్ఫామ్ చేసింది. అప్‌ కమింగ్ ల్లోనూ హీరోలు ఎక్కువగా నెగెటివ్ షేడ్స్‌లోనే కనిపిస్తున్నారు. ప్రజెంట్ సెట్స్ మీద ఉన్న సలార్ లో ప్రభాస్‌ రూత్‌లెస్‌ కిల్లర్‌గా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో ప్రభాస్‌ రాక్షసులే భయపడేంత రాక్షసుడిగా కనిపించబోతున్నారన్న హింట్ ఇచ్చారు మేకర్స్‌.అదే లుక్ తో స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: