టాలీవుడ్  యంగ్  అండ్  టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'హిట్-2'. ఈరోజు రిలీజ్ అయ్యి చాలా మంచి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.ఇక ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించగా, పూర్తి సస్పెన్స్  ఎలిమెంట్స్ తో ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో థ్రిల్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో అడివి శేష్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ కూడా ఎంతగానో ఆసక్తిని చూపుతున్నారు.టాలీవుడ్ బాక్సాఫీస్‌తో పాటు ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో సినిమా యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇక తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి వసూళ్లు రాబడుతుందా అని అందరూ కూడా ఎంతగానో ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో చిత్ర యూనిట్ ఈ సినిమాను హిందీలో కూడా రిలీజ్ చేయాలని చూస్తోంది.


యూనివర్సల్ సబ్జెక్ట్ కావడంతో ఈ సినిమా హిందీ ప్రేక్షకులను కూడా ఖచ్చితంగా చాలా బాగా ఆకట్టుకుంటుందని వారు భావిస్తున్నారు.ఇక అందుకే ఈ సినిమాను హిందీలో డబ్ చేసి చాలా గ్రాండ్ గా డిసెంబర్ 30న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ సినిమాలో అడివి శేష్ సరసన అందాల బ్యూటీ అయిన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా, నేచురల్ స్టార్ నాని ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. ఇదిలా ఉంటే నాని ఈ సినిమాకి శేష్ ని తీసుకొని చాలా మంచి పని చేశాడు. ఎందుకంటే ఇలాంటి సినిమాలకి శేష్ లాంటి టాలెంటెడ్  హీరోలే ప్రాణం పొయ్యగలరు. నిజానికి హిట్ 1 కే శేష్ ని తీసుకుంటే ఓ రేంజిలో ఉండేది. హిట్ 1 కి విశ్వక్ సేన్ ని తీసుకొని నాని చాలా పెద్ద తప్పు చేశాడు. ఆ తప్పుని హిట్ 2 విషయంలో రిపీట్  కాకుండా నాని జాగ్రత్త పడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: