యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. కార్తికేయ 2 తర్వాత ఈయన పేరు దేశం అంతటా  బాగా మారుమోగి పోయింది.. ఇక ఇంతటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత నిఖిల్ నెక్స్ట్ రాబోతున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి..

సినిమా ఇచ్చిన బూస్ట్ తో నెక్స్ట్ సినిమాల బిజినెస్ కూడా బాగా జరుగుతుంది అని చెప్పొచ్చు

ప్రెజెంట్ నిఖిల్ పలు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తున్నాడు. అందులో 18 పేజెస్ ఒకటి. కార్తికేయ 2 జోడీనే ఈ సినిమాలో కూడా కనిపించ బోతున్నారు. కుమారి 21F సినిమా ఫేమ్ సూర్య ప్రతాప్ పల్నాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ కథ అందిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ అంటే ఆ రేంజ్ లోనే ఉంటుంది అని అంతా భావిస్తున్నారు.. అందుకే ఈ సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి.

ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 పై బన్నీ వాసు గారు నిర్మిస్తున్నారు.. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా.. డిసెంబర్ 23న క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతున్న విషయం  మనకు తెలిసిందే.. మరో 20 రోజుల్లోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఇంకా షూటింగ్ జరుపు కుంటుంది అని తెలిసి అంతా ఆశ్చర్య పోతున్నారు.. ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో డే అండ్ నైట్ రెస్ట్ లేకుండా టీమ్ అంతా బాగా కష్టపడుతున్నారట.

సినిమా రాత్రి సమయంలో కూడా షూట్ జరుపు కుంటున్న చిన్న వీడియో క్లిప్  ఒకటి బయటకు రావడంతో ఈ విషయం  అందరికి తెలిసింది.. రెండేళ్ల క్రితమే షూట్ పూర్తి చేసుకుని కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఇప్పుడు మళ్ళీ రీ షూట్ చేయడం కార్తికేయ 2 కారణంగానే అని మనకి తెలుస్తుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా వ్యాప్తంగా అంచనాలు బాగానే పెరిగాయి అని చెప్పొచ్చు.. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ఇప్పుడు మెరుగులు దిద్దుతున్నారు అని తెలుస్తుంది.. చూడాలి మరి ఈ సినిమా ఎలా అలరిస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: