ప్రముఖ యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన చిత్రం హిట్.. యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నాని నిర్మాణ సారధ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే అడవి శేష్ తో ఈ సినిమా సీక్వెల్ ను తాజాగా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అడవి శేష్ కి ఉన్న ఇమేజ్ కి తగ్గట్టుగా దాదాపు 995 స్క్రీన్స్ లో విడుదల చేసి భారీ కలెక్షన్ సాధించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా కూడా విజయం సాధించడంతో అందరి చూపు హిట్ 3పైన పడిందని చెప్పవచ్చు.


అయితే శైలేష్ కొలను తన తదుపరి చిత్రాన్ని ఎవరితో చేయబోతున్నారు అనే వార్తలు ఇప్పుడు బాగా వైరల్ గా మారుతున్నాయి.  ముఖ్యంగా ఎటువంటి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.. ఇలా తదుపరి అంశాల గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో హిట్ 3 సినిమా లో ఏకంగా ముగ్గురి స్టార్ హీరోల సమ్మేళనం ఉండబోతుందని సమాచారం.  తాజాగా ఇదే విషయాన్ని హీరో అడవి శేష్ తో పాటు నిర్మాత నాని కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా హిట్ 3 లో భాగం కానున్నారు అని స్పష్టం చేశారు.  ఇప్పటికే కోలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగిన విజయ్ సేతుపతి.. తెలుగులో విలన్ క్యారెక్టర్లతో ప్రేక్షకులను అలరించాడు. ఆయనకు తెలుగు ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ కూడా ఉంది ఈ క్రేజ్ ను ఆలోచనలో పెట్టుకొని ఆయనకు హిట్ 3 లో  అవకాశం ఇచ్చినట్లు సమాచారం.

అయితే కాన్సెప్ట్ ఇప్పటికే విజయ్ సేతుపతికి వినిపించినట్లు ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే తన పాత్రకు ఎంతవరకు న్యాయం చేస్తాడో చూడాలి. ఇకపోతే హిట్ 3 సినిమాలో కూడా అడవి శేష్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.  అలాగే నాచురల్ స్టార్ నాని కూడా కొన్ని నిమిషాల పాటు ఈ సినిమాలో కనిపించనున్నారట.  మరి ఈ ముగ్గురి స్టార్ హీరోల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మరెంత విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: