టాలివుడ్   అల్లు హీరో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గురించి మనందరికీ  బాగా తెలిసిందే. ఇటీవల విడుదల అయిన పుష్ప సినిమాతో పాన్ ఇండియాస్టార్ గా మారాడు అల్లు అర్జున్.

పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ క్రేజ్  బాగా పెరిగిపోయింది. అంతేకాకుండా టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా అల్లు అర్జున్ ని ఫాలో అయ్యే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది అని మనకి తెలుస్తంది బాలీవుడ్ లో కూడా అల్లు అర్జున్ కి మార్కెట్ విరిగిపోయింది. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ పెరగడంతో టాలీవుడ్ దర్శకులతో పాటు బాలీవుడ్ దర్శకులు కూడా అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి విపరీతంగా ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇటీవల బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన రోహిత్ శెట్టి బన్నీతో సినిమా చేయాలని ఉందంటు తన మనసులోని మాటను  బయటపెట్టిన విషయం  మనకి తెలిసిందే. అల్లు అర్జున్ తో కలిసి సినిమా చేయడం తనకు చాలా ఇష్టం అని తెలిపారు. కాగా బాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ శెట్టి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన సినిమా సర్కస్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతున్నారు రోహిత్ శెట్టి.

తాజాగా సర్కస్ సినిమా ట్రైలర్ ను  ఆయన విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్ ఈవెంట్ లో పాల్గొన్న రోహిత్ శెట్టి అలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకి సౌత్ హీరోస్ అంటే చాలా ఇష్టమని.. అందులో అజిత్ కుమార్, అల్లు అర్జున్, కార్తి , సూర్య, నాగర్జున లాంటి హీరోలతో కలిసి పని చేయడం మరింత ఇష్టమని తెలిపారు  డైరెక్టర్ రోహిత్ శెట్టి. మరి ముఖ్యంగా అల్లు అర్జున్ పేరు స్పెషల్ గా ప్రస్తావిస్తూ అల్లు అర్జున్ డాన్స్ అంటే తనకు చాలా ఇష్టం అని ఇలా చెప్పుకొచ్చారు  డైరక్టర్ రోహిత్ శెట్టి.

మరింత సమాచారం తెలుసుకోండి: